ఏకే 47 మిస్సింగ్ కలకలం

By Nagaraju TFirst Published Oct 13, 2018, 9:06 PM IST
Highlights

విజయనగరం జిల్లాలో ఏకే 47 మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈవీఎంలు తరలిస్తున్న భద్రతాసిబ్బందికి చెందిన ఏకే47 తుపాకిని గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒడిస్సాలో ఎన్నికల నిమిత్తమై కట్టుదిట్టమైన భద్రతా దళాల నడుమ ఈవీఎంలను లారీలో తరలిస్తున్నారు. 
 

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఏకే 47 మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈవీఎంలు తరలిస్తున్న భద్రతాసిబ్బందికి చెందిన ఏకే47 తుపాకిని గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒడిస్సాలో ఎన్నికల నిమిత్తమై కట్టుదిట్టమైన భద్రతా దళాల నడుమ ఈవీఎంలను లారీలో తరలిస్తున్నారు. 

అయితే శనివారం తెల్లవారుజామున నాతవలస టోల్‌గేట్‌ వద్దకి లారీ చేరుకుంది. భద్రతాసిబ్బంది విశ్రాంతి కోసమని టోల్‌గేట్‌ దాటిన తర్వాత హైవే పక్కన లారీని ఆపారు. కాసేపు సిబ్బంది విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఏకే 47ను అపహరించుకుపోయారు.

నిద్రలేచి చూసే సరికి ఏకే 47 కనిపించకపోవడంతో భద్రతా దళం ఆందోళన వ్యక్తం చేసింది. అభిమన్యు సాహూ అనే భద్రతా సిబ్బందికి చెందిన ఏకే 47 తుపాకీ మిస్సైనట్లు గుర్తించారు. వెంటనే భోగాపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే ఏఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.  

click me!