సోమిరెడ్డికి తప్పిన పెను ప్రమాదం.. సీటు బెల్టే కాపాడింది

By sivanagaprasad kodatiFirst Published Oct 14, 2018, 11:20 AM IST
Highlights

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గోనేందుకు మంత్రి సోమిరెడ్డి మూడు రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లాలో మకాం వేశారు.

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గోనేందుకు మంత్రి సోమిరెడ్డి మూడు రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లాలో మకాం వేశారు. దీనిలో

భాగంగా ఇవాళ మందస వెళ్తుండగా హరిపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి.. డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో పాటు మంత్రి సీటు బెల్టు పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కారు డివైడర్‌ను ఢీకొట్టిన వెంటనే సోమిరెడ్డి కారు దిగారు.. అనంతరం మంత్రి కారును అనుసరిస్తున్న భద్రతా సిబ్బంది ఆయనను మరో కారులో మందస తరలించారు. మరోవైపు తిత్లీ తుఫానుతో తీవ్రంగా  నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో సహాయ పునరావాస కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.

విద్యుత్తు సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ఆ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. శ్రీకాకుళంలో బస చేసిన ముఖ్యమంత్రి అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తూ.. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.
 

click me!