ఫిరాయింపుల్లో వీళ్ళకి టిక్కెట్లు  డౌటేనా !

Published : Sep 11, 2017, 07:05 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఫిరాయింపుల్లో వీళ్ళకి టిక్కెట్లు  డౌటేనా !

సారాంశం

ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఎంతమందికి వచ్చే ఎన్నికల్లో టిక్కుట్లు లభిస్తుందనే విషయమై చర్చ మొదలైంది. అసలే కొందరికి టిక్కెట్లలో కోత పడుతుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా? పార్టీ ఫిరాయించినందుకు ఇటు వైసీపీ శ్రేణులు మండిపడుతుండగా, అటు టిడిపి శ్రేణులు కుడా విరుచుకుపడుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు టిడిపి నేతలు కుడా ఏమాత్రం సహకరించటం లేదు.

ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఎంతమందికి వచ్చే ఎన్నికల్లో టిక్కుట్లు లభిస్తుందనే విషయమై చర్చ మొదలైంది. అసలే కొందరికి టిక్కెట్లలో కోత పడుతుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా? ఎందుకంటే, ఏవో ప్రలోభాలకు గురై పార్టీ ఫిరాయింపులైతే చేసారు కానీ వారికి వారి నియోజకవర్గాల్లో బాగానే వ్యతిరేకత ఉందన్న విషయం వాస్తవం.

పార్టీ ఫిరాయించినందుకు ఇటు వైసీపీ శ్రేణులు మండిపడుతుండగా, అటు టిడిపి శ్రేణులు కుడా విరుచుకుపడుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు టిడిపి నేతలు కుడా ఏమాత్రం సహకరించటం లేదు. అందుకే తరచూ గొడవలవుతున్నాయి.

ఇటువంటి నేపధ్యంలో కడప జిల్లా బద్వేలు ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములు విషయం వెలుగుచూసింది. జయరాములుపై అందరి ముందు సిఎం మండిపడ్డారు. అంతేకాకుండా పార్టీ నేతలను కలుపుకునిపోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కుడా ఇచ్చేది లేదంటూ నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపేమో నేతలు కలిసిరావటంలేదు. ఇంకోవైపేమో చంద్రబాబు వార్నింగ్. దాంతో జయరాముల్లో టెన్షన్ మొదలైంది.

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాషా పరిస్ధితి కుడా ఇదే. కడప జిల్లా జమ్మలమడుగు ఎంఎల్ఏ, మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా అద్దంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు ఎంఎల్ఏ అశోక్ రెడ్డి, కర్నూలు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి, కోడుమూరు ఎంఎల్ఏ మణిగాంధి, కృష్ణాజిల్లాలోని పామర్రు ఎంఎల్ఏ ఉప్పులేటి కల్పనతో పాటు మరికొందరు పరిస్ధితి కుడా అదే. మొత్తం 20 మంది ఎంఎల్ఏల్లో ఫిరాయింపు మంత్రులతో పాటు మరో నలుగురికి తప్ప మిగిలిన వారికి టిక్కెట్లు డౌటే అంటున్నారు.

తాజాగా జయరాములు వ్యవహారంతో అటువంటి వారిలో అయోమయం ఎక్కువైంది. ఎందుకంటే, బద్వేలు పరిస్ధితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను కనబడుతోంది. ప్రస్తుతానికి బద్వేలు నియోజకవర్గం విషయంలో మాత్రమే అధినేత వైఖరి బయటపడింది. ఇంకెన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు వైఖరి బయటపడుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Ap Deputy CM Pawan Kalyan: అమ్మ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం | Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Visit Visakhapatnam Zoo | IndiraGandhi Zoological Park| Asianet News Telugu