జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ: తేలనున్న అమరావతి భవితవ్యం

By narsimha lode  |  First Published Jan 17, 2020, 11:57 AM IST

హై పవర్ కమిటీ శుక్రవారంనాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయింది. రాజధానిపై ఇవాళ్టి సమావేశంలో తేల్చే అవకావం ఉందనే ప్రచారం సాగుతోంది.


అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ  శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయింది.

హైపవర్ కమిటీ ఇప్పటివరకు చర్చించిన అంశాలను సీఎం జగన్‌కు కమిటీ సభ్యులు వివరించనున్నారు. ఇవాళ జరిగే హై పవర్ కమిటీ భేటీలో మూడు రాజధానులపై పూర్తి స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Latest Videos

undefined


ఇప్పటికే మూడు సార్లు హై ప‌వ‌ర్ క‌మిటి సమావేశమైంది.ఇవాళ సాయంత్రం కూడ మరోసారి హైపవర్ కమిటీ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాజధాని రైతులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను సీఆర్‌డీఏ దృష్టికి తీసుకురావాలని హైపవర్ కమిటీ కూడ సూచించింది. 

also read:అమరావతి: విశాఖకు రాజధాని తరలించొద్దంటూ సీఆర్‌డీఏకు రైతుల అభ్యంతరాలు

Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా

రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు కూడ తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా సీఆర్‌డీఏకు అందిస్తున్నారు. ఇవాళ సాయంత్రమే రైతులు తమ అభిప్రాయాలను చెప్పేందుకు చివరి రోజు.

Also read:కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారాడు: మందడంలో జగన్‌పై బాబు ఫైర్

Also read:అసెంబ్లీని రద్దు చేయండి, రాజకీయ సన్యాసం: జగన్‌కు బాబు సవాల్

ఇవాళ సాయంత్రం మరోసారి భేటీ అయిన తర్వాత ఈ నెల 20వ తేదీన హైపవర్ కమిటీ సీఎం జగన్ కు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుంది. ఈ కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలపనుంది. అదే రోజున అసెంబ్లీలో కూడ హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

click me!