బిజెపితో పవన్ కల్యాణ్ పొత్తుపై చంద్రబాబు గప్ చుప్: అంచనా ఇదీ..

By telugu teamFirst Published Jan 17, 2020, 11:18 AM IST
Highlights

పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన, బిజెపి మధ్య ఏర్పడిన పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మౌనం వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పొత్తుపై నోరు విప్పవద్దని ఆయన టీడీపీ నేతలను ఆదేశించినట్లు సమాచారం.

అమరావతి: బిజెపి, జనసేనల మధ్య పొత్తుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బిజెపితో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవడంపై మౌనం వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. పొత్తుపై మాట్లాడవద్దని ఆయన టీడీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారు. 

బిజెపి, జనసేన మధ్య పొత్తు ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు అధినేత వైఎస్ జగన్ కు తలనొప్పులు తెచ్చిపెడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనతో బిజెపి పొత్తు పెట్టుకున్న పరిణామం జగన్ కు తలనొప్పులు తెచ్చిపెడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. 

Also Read: బీహార్ ఫార్ములా: ఏపీ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్

రాజధాని విషయంలోనే కాకుండా కేసుల విషయంలో కూడా జగన్ చిక్కులు ఎదుర్కుంటారని, అందువల్ల తాము మౌనం పాటించడమే మంచిదని చంద్రబాబు టీడీపీ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. గురువారంనాడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశంలో జనసేన, బిజెపి పొత్తు వ్యవహారం చర్చకు వచ్చింది. 

బిజెపి, జనసేన పొత్తు నేపథ్యంలో ఏం జరుగబోతుందో వేచి చూద్దామని, అప్పటి వరకు దానిపై మౌనం వహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. రాజధాని అమరావతిపై అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నందున ఇప్పుడు విమర్శలకు దిగితే దానికి విఘాతం కలుగుతుందని ఆయన అంటున్నారు.

Also Read: చంద్రబాబు బాకీ తీరుస్తావా: పవన్ కల్యాణ్ ను ఏకిపారేసిన అంబటి రాంబాబు 

అమరావతి విషయంలో జనసేన, బిజెపి కలిసి ఉద్యమం చేపట్టే అవకాశం ఉందని,  బిజెపి ఉద్యమం చేపట్టిందంటే రాజధాని మార్పును కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లేనని చంద్రబాబు చెప్పారు. బిజెపి ఉద్యమిస్తే రాజధానిని అమరావతి నుంచి తరలించడం జగన్ కు కష్టమవుతుందని ఆయన భావిస్తున్నారు. 

జనసేన, బిజెపి పొత్తు వల్ల జగన్ కేసుల విషయంలో చిక్కుల ఎదుర్కోవచ్చునని ఓ టీడీపీ సీనియర్ నేత అన్నారు. కేసుల విచారణ జాప్యం కావడానికి జగన్ కు ఇప్పటి వరకు కేంద్రం సహకరించడమే కారణమని, ఇక జగన్ ఈ విషయంలో కేంద్ర సహకారం లభించదని ఆయన అన్నట్లు తెలుస్తోంది. జనసేనతో కలిసి బలపడాలని చూస్తున్న బిజెపి ఆ దిశగా పావులు కదుపుతుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

click me!