వైసీపీ ఎమ్మెల్యే సామినేనికి హైకోర్టులో చుక్కెదురు.. డీజీపీకి నోటీసులు

By telugu teamFirst Published Nov 12, 2021, 3:12 PM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు కేసుల ఎత్తివేత వ్యవహారంలో హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై పది కేసులను ఎత్తేస్తూ జగన్ ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో జీవో జారీ చేసింది. ఒక్క జీవోతో పది కేసులను ఎలా ఎత్తేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

అమరావతి: YCP ఎమ్మెల్యే Samineni Udayabhanuకు హైకోర్టులో చుక్కెదురైంది. కేసుల ఉపసంహరణ వ్యవహారంలో High Court సీరియస్ అయింది. ఉదయభానుపై నమోదైన 10 కేసులను ఎలా ఉపసంహరిస్తారని(Withdraw) ప్రశ్నించింది. 10 కేసులను ఉపసంహరిస్తూ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ ఏపీజేఎఫ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు పిటిషన్ వేశారు. కృష్ణాంజనేయులు తరఫున న్యాయవాది జడ శ్రవణ్ వాదించారు.  

ఒక్క జీవోతో పది కేసులను ఎలా ఉపసంహరించుకుంటారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. డీజీపీ, హోం శాఖ ముఖ్యకార్యదర్శి నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Also Read: హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని, అంబులెన్స్‌లు ఆపొద్దు: వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై వివిధ దశల్లో విచారణలో ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ ఈ ఏడాది మే నెలలో ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించడానికి ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ప్రత్యేక కోర్టులో ఉదయభానుపై కేసులు విచారణలో ఉన్నాయి. కేసుల ఎత్తివేత కోసం ఆయా కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.

click me!