తమిళనాడు : మీరు ఎందరికో స్పూర్తి.. మ‌హిళా ఎస్సై రాజేశ్వరికి ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌శంసలు

Siva Kodati |  
Published : Nov 12, 2021, 02:38 PM IST
తమిళనాడు : మీరు ఎందరికో స్పూర్తి.. మ‌హిళా ఎస్సై రాజేశ్వరికి ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌శంసలు

సారాంశం

చెన్నైలోని టీపీ చత్రమ్ ప్రాంతంలో స్పృహ కోల్పోయి, ప‌డిపోయిన 28 ఏళ్ల ఓ వ్య‌క్తిని తన భుజాలపై మోసుకెళ్లి ఓ మ‌హిళా ఎస్సై అతని ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే.  జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) సైతం సదరు ఎస్సైని అభినందించారు

త‌మిళ‌నాడులో (tamilnadu rains) భారీ వ‌ర్షాలు కారణంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో చెన్నై నగరం (chennai floods)  నీట మునగ్గా.. రోడ్లు జలమయ్యాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేప‌థ్యంలో చెన్నైలోని టీపీ చత్రమ్ ప్రాంతంలో స్పృహ కోల్పోయి, ప‌డిపోయిన 28 ఏళ్ల ఓ వ్య‌క్తిని తన భుజాలపై మోసుకెళ్లి ఓ మ‌హిళా ఎస్సై అతని ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. అక్కడే ఉన్న ఆటోలోకి ఎక్కించి అతనిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

తాజాగా జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) సైతం సదరు ఎస్సైని అభినందించారు. 'భారీ వర్షాలలో సైతం భారమైనా బాధ్యతను నెరవేర్చిన పోలీసు అధికారిణి రాజేశ్వరి గారు చెన్నై తుపాను సహాయక చర్యల్లో సృహ కోల్పోయిన వ్యక్తిని తన భుజంపై వేసుకొని ఆటోలో ఆసుపత్రికి తరలించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. ఆమెకు వీరమహిళ విభాగం తరుపున సెల్యూట్' అని జ‌న‌సేన వీర‌మ‌హిళా విభాగం ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. దాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రీట్వీట్ చేశారు. ఆ మ‌హిళా ఎస్సై చేసిన ప‌ని ప్ర‌శంస‌నీయ‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. చెన్నైలో వ‌ర‌ద‌లు సంభ‌వించిన స‌మ‌యంలో మ‌హిళా ఎస్సై రాజేశ్వ‌రి త‌న సేవ‌లతో స్ఫూర్తిదాయ‌కంగా నిలిచార‌ని పవన్ కొనియాడారు. కాగా, ప‌లువురు ఐపీఎస్ అధికారులు కూడా మ‌హిళా ఎస్సై అందించిన సేవ‌ల‌ను కొనియాడారు. 

Also Read:Chennai Cop Rajeswari: హ్యాట్సాఫ్.. వ్యక్తిని భుజాలపై మోసుకెళ్లిన ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి.. వైరల్ వీడియో

కాగా.. టీపీ చత్రం (TP Chatram) ప్రాంతంలోని శ్మశాన వాటికలో చెట్టు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో టీపీ ఛత్రం పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి (Chennai inspector Rajeswari ) తన తోటి పోలీసులతో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. శ్మశాన వాటికలో 3 రోజులుగా పనిచేస్తున్న ఉదయ్‌కుమార్ అనే 25 ఏళ్ల స్పృహ తప్పి పడిపోయాడు. అయితే అతను చనిపోయినట్టుగా భావించినప్పటికీ అతడు ప్రాణాలతో ఉన్నట్టుగా తేలింది. దీంతో పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి ఏ మాత్రం సమయం వృథా చేయకుండా అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. 

ఎవరి సాయం తీసుకోకుండా అతడిని తన భుజాలపై మోసుకుంటూ ముందుకు సాగింది. తొలుత పోలీసు వాహనంలో ఉన్న దుప్పట్లును తీసుకుని.. అతని ఆటో వద్దకు తీసుకెళ్లింది. ఆటో వద్దకు చేరిన తర్వత అందులో దుప్పట వేసి.. అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సహాయక చర్యల్లో మహిళ పోలీసు రాజేశ్వరి చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయ్ కుమార్ శ్మశాన వాటికలో పనిచేసే వ్యక్తి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్