కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ బెంచ్ నుండి న్యాయమూర్తి తప్పుకొన్నారు. దీంతో ఈ కేసు విచారణను మరో బెంచ్ కి వెళ్లనుంది.
అమరావతి: కృష్ణా జిల్లా Kondapalli మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు సంబంధించిన విచారణలో బుధవారం నాడు ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ విచారణ బెంచ్ నుండి తప్పుకొంటున్నట్టుగా న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో ఈ కేసు విచారణను మరో బెంచ్ కి వెళ్లనుంది. ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తితో ycp కౌన్సిలర్ల తరపున వాదిస్తున్న న్యాయవాది వాదనకు దిగారు. తన వాదనలను వినాలని advocate పట్టుబట్టారు. అయితే న్యాయవాది వాదనలను వినబోనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంతేకాదు కేసు విచారణ నుండి కూడా తప్పుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. దీంతో మరో బెంచ్ ఈ కేసు విచారణ చేయనుంది.
కొండపల్లి మున్సిపాలిటీలో విజయవాడ ఎంపీ Kesineni Nani ఎక్స్‌అఫిషియో ఓటు హక్కు నమోదు చేసుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.గతంలో విజయవాడ కార్పోరేషన్ లో Vijayawada ఎంపీ కేశినేని ఎక్స్ అఫిషియో ఓటు హక్కును నమోదు చేసుకొన్నారని వైసీపీ గుర్తు చేస్తోంది.. దీంతో కొండపల్లి మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓటు హక్కును నమోదు చేసుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయమై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారువిజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు హక్కుపై ఇవాళ విచారణ జరిగింది.
undefined
also read:కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక: విచారణ సోమవారానికి వాయిదా
వైసీపీ కౌన్సిలర్ల తరపున వాదనలను వినబోనని High Court Judge ప్రకటించారు.కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు సంబంధించి టీడీపీ చైర్మెన్ అభ్యర్ధికి 16 ఓట్లు, వైసీపీ కి చెందిన చైర్మెన్ అభ్యర్ధికి 15 ఓట్లు వచ్చాయి.. వైస్ చైర్మెన్ కు సంబంధించిన ఎన్నికలో కూడా టీడీపీకి 16, వైసీపీకి 15 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల ప్రక్రియ వీడియో రికార్డు చేసి కోర్టుకు ఈ ఏడాది నవంబర్ 25న సమర్పించారు ఎన్నికల అధికారి. అంతకు ముందు రోజే మున్సిపల్ చైర్మెన్ ఎన్నికను నిర్వహించారు అధికారులు. అంతకు ముందు రెండు రోజులు వరుసగా ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేశారు. అయితే నవంబర్ 24న కచ్చితంగా ఎన్నికను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మున్సిపల్ చైర్మెన్ ఎన్నికను నిర్వహించారు అధికారులు.