సర్కస్ వ్యాఖ్యలపై చర్యలు: ఆశోక్‌గజపతిరాజుపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

Published : Dec 22, 2021, 03:15 PM ISTUpdated : Dec 22, 2021, 03:27 PM IST
సర్కస్ వ్యాఖ్యలపై చర్యలు: ఆశోక్‌గజపతిరాజుపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

సారాంశం

నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం నిర్మాణం శంకుస్థాపన స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఆలయ నిర్మాణ శంకుస్థాపన విషయంలో ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆశోక్ గజపతి రాజు ఆగ్రహం  వ్యక్తం చేశారు.  

విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త  Ashok Gajapati raju   వీరంగం సృష్టించారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రామతీర్థం బోడికొండపై శ్రీకోదండరామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన విషయమై ఆలయ దర్మకర్తలతో చర్చించలేదని మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు మండిపడ్డారు. ఆలయానికి శంకుస్థాపన చేసే సమయంలో మంత్రి Vellampalli Srinivas  తో మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు గొడవకు దిగారు. సర్కస్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సరికావని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

also read:అశోక్ గజపతిరాజుపై కక్షసాధింపు... వైసిపి గూండాలను రంగంలోకి దింపిన జగన్..: అచ్చెన్నాయుడు

ఈ  సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలన్నారు. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య గా పేర్కొన్నారు. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. అని ఆశోక్ గజపతి రాజును ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అని అశోక్ గజపతి అనడంపై చర్యలు తీసుకొంటామన్నారు. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్‌గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి  మండిపడ్డారు.ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోంద'ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. 

అంతకుముందు ఆలయ ఆవరణలోనే శంకుస్థాపన శిలాఫలాకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు పక్కకు తోసివేసేందుకు ప్రయత్నించారు. శంకుస్థాపన ప్రాంతంలోనే బైఠాయించి నిరసనకు ప్రయత్నించారు. అధికారులు ఆశోక్‌గజపతి రాజును అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఏపీ ప్రభుత్వం తమ పట్ల కనీస మర్యాద కూడా పాటించలేదని ఆయన ఆరోపించారు.  ఏడాది క్రితం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసమైతే ఇప్పటివరకు  ఎందుకు ఆలయ పునర్నిర్మాణ ప్రయత్నాలు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.ఈ ఆలయంలో రాముడి విగ్రహన్ని ధ్వంసం చేసిన కేసులో ఆధారాలను తారుమారు చేసేందుకే ఆలయ పునర్నిర్మాణ పనులు ఆలస్యం చేశారా అని ఆశోక్ గజపతి రాజు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ విగ్రహం ధ్వంసం చేశారని తనతో పాటు చంద్రబాబు నాయుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడిలపై కూడా ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఏడాది క్రితం విగ్రహం ధ్వంసం చేస్తే ఇంకా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని ఆశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం తాను ఇచ్చిన విరాళాన్ని తిరస్కరించారన్నారు. అసలు భక్తులు ఇచ్చే విరాళాన్ని ఎందుకు తిరస్కరించే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.ఆలయ సంస్కృతి, సంప్రదాయాలను అధికారపార్టీ పాటించలేదన్నారు. ధర్మకర్త చేయాల్సిన పనులు కూడా చేయనివ్వలేదని  ఆశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కొబ్బరాయ కూడా కొట్టకుండా వైసీపీ శ్రేణులు నెట్టేశారన్నారుప్రభుత్వం చాలా మూర్ఖత్వంగా వెళుతోందని, రాజ్యాంగాన్ని అతిక్రమించి, చట్టాలు, కోర్టులు చెప్పిన అంశాలను తుంగలో తొక్కిందన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?