బూతుల మంత్రితో కొబ్బరిచిప్పల మంత్రి పోటీ...: రామతీర్థం ఘటనపై చంద్రబాబు సీరియస్

By Arun Kumar P  |  First Published Dec 22, 2021, 3:51 PM IST

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఆలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ సీఎం,టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. 


అమరావతి: విజయనగరం జిల్లా (vijayanagaram district) రామతీర్థం (ramatheertham temple)లోని ప్రాచీన కోదండరామస్వామి ఆలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) స్పందించారు. మాజీ కేంద్రమంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు (ashok gajapathi raju)కు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

''దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ (ycp) ప్రభుత్వం దిగజారింది. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా.? కనీసం ప్రోటోకాల్ నిర్వహించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా.?'' అంటూ tdp chief చంద్రబాబు మండిపడ్డారు. 

Latest Videos

undefined

''ప్రోటోకాల్ పై నిలదీసిన అశోక్ గజపతిరాజుపై మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ (vellampalli srinivas), బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) దాడికి తెగించడం దుర్మార్గం. మంత్రుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆలయ పెద్దలకు మర్యాదలు ఇవ్వాలన్న ఇంగితజ్ఞానం మంత్రులకు లేదా.? కక్ష సాధింపులతో సాంపద్రాయాలకు ఈ ప్రభుత్వం శఠగోపం పెడతోంది'' అని ఆరోపించారు.

read more  అశోక్ గజపతిరాజుపై కక్షసాధింపు... వైసిపి గూండాలను రంగంలోకి దింపిన జగన్..: అచ్చెన్నాయుడు

''వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారు. మాన్సాన్ ట్రస్టు (MANSAS Trust) చైర్మన్ గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేదు. దేవుడికి చేసే పూజలను కూడా జగన్ కు చేసే భజనలా ఊహించుకుంటున్నారు. భక్తితో ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకు ఎవరిచ్చారు.?'' అని చంద్రబాబు నిలదీసారు. 

''సాంప్రదాయాలను కాలరాస్తే దైవాగ్రహానికి గురవ్వక తప్పదు. రోడ్డు మీద వీరంగం సృష్టించినట్లు దేవుని గర్భ గుడిలోనూ వీరంగం సృస్టిస్తున్నారు. రామతీర్థంలో రాముడి తల తొలగించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎలా నిందలు వేయాలనిపిస్తోంది.?'' అని అడిగారు. 

read more  విజయనగరం రామతీర్థం కొండపై ఉద్రిక్తత.. ఆందోళ‌న‌కు దిగిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు

''బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరుపారేసుకుంటున్నారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని రెండేళ్లుగా కాపాడుతున్నారు. ఒక్క నిందితుడినైనా ప్రజల ముందు నిలబెట్టారా.? మీ అరాచక, దుర్మార్గాలు ఎల్లకాలం సాగవు'' అని చంద్రబాబు హెచ్చరించారు. 


ఇక ఈ ఘటనపై టిడిపి శ్రేణులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసం తమ ఆస్తులను వదులుకున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని ఇలా అవమానించడం భావ్యం కాదని అంటున్నారు. రాజకీయంగా ఆయనను ఎదుర్కోవాలని కానీ ఇలా పవిత్రమైన దేవాలయాల విషయంలో కక్షసాధింపు సరికాదని వైసిపి ప్రభుత్వానికి టిడిపి నాయకులు సూచిస్తున్నారు. 

మరోవైపు వైసిపి శ్రేణులు మాత్రం కావాలనే అశోక్ గజపతిరాజు ఆలయ అభివృద్దిని అడ్డుకునే ప్రయత్ని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రామతీర్థం ఆలయ ధర్మకర్తగా వున్న అశోక్ గజపతిరాజును ఎవరూ అవమానించలేదని... కావాలనే ఆయన  వీరంగం సృష్టించారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సర్కస్ చేస్తున్నారంటూ అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు సరికావని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
 

click me!