
ఆయనకు ఓ మెడికల్ షాప్ ఉంది. దీంతో పాటు రాత్రి సమయంలో వేరే మెడికల్ షాప్ లో కూడా పని చేస్తూ ఉంటాడు. భార్య ఇంటి వద్దనే చీరల వ్యాపారం చేస్తుంటుంది. అయితే ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్య దగ్గరకు వచ్చి చీరలు కావాలని కస్టమర్ లు అడిగారని, ప్యాక్ చేసి ఇవ్వాలని కోరాడు. భార్య చీరలు ప్యాక్ చేసి ఇవ్వడంతో బైక్ పై బయలుదేరాడు. ఇంటికి రాలేదు. మరుసటి రోజు ఓ చోటు శవంగా కనిపించాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
నడిరోడ్డు మీద ప్రభుత్వ అధికారి చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే, వీడియో వైరల్
వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూల్ జిల్లా కిందిప్రాతకోట గ్రామానికి చెందిన 42 ఏళ్ల రాముకు భార్య మాధవి, తొమ్మిదేళ్ల కుమారుడు శరత్ చంద్ర ఉన్నారు. రాముకు సొంతంగా ఓ మెడికల్ షాప్ ఉంది. అలాగే రాత్రి సమయంలో పైప్రాతకోట గ్రామంలోని లక్ష్మన్నకు చెందిన ఓ మెడికల్ షాప్ లో పని చేస్తున్నాడు. భార్య ఇంటి వద్ద చీరలు అమ్ముతుంటుంది. అయితే ఎప్పటిలాగే సోమవారం రాత్రి పైప్రాతకోట గ్రామంలోని మెడికల్ షాపులో రాము పని చేస్తున్నాడు. 7.30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్తానని యజమానికి చెప్పాడు.
అనంతరం ఇంటికి వచ్చాడు. కొందరు చీరలు కొంటానని అన్నారని, ఐదు చీరలు ప్యాక్ చేసి ఇవ్వాలని భార్యకు సూచించాడు. అతడు చెప్పినట్టు భార్య చేసింది. అనంతరం వాటిని తనపై బైక్ లో పెట్టుకొని రాత్రి సమయంలోనే బయలుదేరాడు. సొంత మెడికల్ షాపునకు చేరుకున్నాడు. అక్కడ నాలుగు చీరలు ఉంచి, 8 గంటల సమయంలో ఒకటి బైక్ లో పెట్టుకొని బయటకు వెళ్లాడు. రాత్రి 8.30 గంటల సమయంలో భార్య ఫోన్ చేసింది. దీంతో తాను మెడికల్ షాప్ లోనే ఉన్నానని చెప్పాడు.
8.30 గంటల ప్రాంతలో భార్య ఫోన్ చేయగా.. మెడికల్ షాపులోనే ఉన్నట్లు చెప్పాడు. 9.30 గంటల ప్రాంతంలో ఆమె ఇంకో సారి ఫోన్ చేసింది. కానీ ఈ సారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కానీ మరసటి రోజు ఉదయం భాస్కరాపురం బ్రిడ్జి వద్ద రాము హత్యకు గురై కనిపించాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. వారి వచ్చి కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.
అయితే పోలీసులు మాధవి విచారించగా.. గత కొంత కాలంగా భర్త ఓ మహిళతో ఫోన్ మాట్లాడుతున్నాడని తెలిపారు. తాను ఆమె ఎవరని ప్రశ్నించానని, అయితే మందుల కోసం వచ్చిన కష్టమర్లు అని చెప్పేవాడని చెప్పారు. తాను దగ్గర ఫోన్ మాట్లాడేవాడు కాదని, మిద్దపైకి లేకపోతే బయటకు వెళ్లి మాట్లాడేవాడని తెలిపారు.
దీంతో ఈ హత్యకు వివాహేతర సంబంధం కారణమని పోలీసులు అనుమానిస్తున్నారని ‘సాక్షి’ కథనం పేర్కొంది. పథకం ప్రకారమే రామును హతమార్చినట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ, నందికొట్కూరు రూరల్ సీఐ, జూపాడుబంగ్లా ఎస్ఐ తో పాటు పలువురు పోలీసులు పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.