ఆ ఇష్టమే హరికృష్ణ ప్రాణాలు తీసింది

By pratap reddyFirst Published Aug 29, 2018, 8:50 AM IST
Highlights

నందమూరి హరికృష్ణకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆయన ప్రాణాలు తీసింది. వేగంగా వాహనాలు నడపడం ఆయనకు ఇష్టం. ఆయన డ్రైవింగ్ నైపుణ్యం వల్లనే తన చైతన్యరథసారిథిగా తండ్రి ఎన్టీ రామారావు హరికృష్ణను ఎంచుకున్నారు.

హైదరాబాద్: నందమూరి హరికృష్ణకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆయన ప్రాణాలు తీసింది. వేగంగా వాహనాలు నడపడం ఆయనకు ఇష్టం. ఆయన డ్రైవింగ్ నైపుణ్యం వల్లనే తన చైతన్యరథసారిథిగా తండ్రి ఎన్టీ రామారావు హరికృష్ణను ఎంచుకున్నారు.

ఎన్టీఆర్ ను చూడడానికి రోడ్లపైకి తండోపతండాలుగా ప్రజలు చేరుకున్నా, ఏ విధమైన ప్రమాదం జరగకుండా చైతన్య రథాన్ని నడిపిన నైపుణ్యం హరికృష్ణది. అటువంటి హరికృష్ణ కారు నడుపుకుంటూ బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి ఉదయం 6.05 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురై మరణించారు. 

టెస్టు డ్రైవింగులు చేయడం హరికృష్ణకు ఇష్టం. కార్లను, బస్సులను ఆయన ఆయన నడుపుతూ తన ఇష్టాన్ని ప్రకటించుకనేవారు. 

హరికృష్ణ మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.  

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

కామినేని ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్

నాన్నకు ప్రేమతో.. లక్ష కిలోమీటర్లు చైతన్యరథాన్ని నడిపిన హరికృష్ణ

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

click me!