మార్కెట్ యార్డులో అశ్లీల నృత్యాలు... నలుగురు వైసిపి నేతలపై కేసు నమోదు

Arun Kumar P   | Asianet News
Published : Jul 12, 2021, 11:13 AM ISTUpdated : Jul 12, 2021, 11:23 AM IST
మార్కెట్ యార్డులో అశ్లీల నృత్యాలు... నలుగురు వైసిపి నేతలపై కేసు నమోదు

సారాంశం

గుంటూరు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డులో యువతులతో అశ్లీల నృత్యాల కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన వైసిపి నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

గుంటూరు: రైతు దినోత్సవం రోజున గుంటూరు జిల్లా క్రోసూరులో యువతులతో అశ్లీల నృత్యాలను ఏర్పాటుచేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్యాన్సర్ల నృత్యాలతో  వైసీపీ నాయకులు హంగామా చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆనుమతి లేకుండా కొవిడ్ నిబంధనలు పాటించకుండా మార్కెట్ యార్డులో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తున్న వీడియో వైరల్ మారింది. 

ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. వీడియో ఆదారంగా ముగ్గురు మహిళా డాన్సర్లతో పాటు నలుగురు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోవిడ్ సమయంలో ఇలా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 

read more  పుట్టినరోజు వేడుకల్లో డ్యాన్సర్లతో వైసీపీ నేతల చిందులు (వీడియో)

క్రోసూరుకు చెందిన వైసీపీ నాయకుడు షేక్ గని రైతు దినోత్స‌వం రోజున తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాడు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కొందరు యువతులతో కలిసి చిందేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu
Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu