దారుణం : కాళ్లు కడుక్కుందామని వెళ్లి.. క్వారీ గుంతలో పడి 4 యువకులు దుర్మరణం.. హోమంత్రి సంతాపం..

By AN Telugu  |  First Published Jul 12, 2021, 10:48 AM IST

ఆదివారం కావడంతో వీరంతా కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై ప్రత్తిపాడు మండలం తుమ్మల పాలెం డైట్ కళాశాల సమీపంలోని  కొండ క్వారీ వైపు వెళ్లారు. వర్షం పడటం వల్ల కొందరి కాళ్లకు బురద అయింది. దీంతో కాళ్లు కడుక్కునేందుకు కొండల మధ్యన ఉన్న లోతైన క్వారీ గుంతలోకి దిగారు.


గుంటూరు జిల్లా : అప్పటివరకు అంతా కలిసే తిరిగారు. ఓకే బండిపై  చక్కర్లు కొట్టారు.  కలిసి తాగారు. కలిసి తిన్నారు. సరదాగా గడిపారు. చివరికిక్వారీ గుంతలో గల్లంతయ్యారు. ఆ క్షణంలో ఒకరిని కాపాడేందుకు మరొకరు శతవిధాలా ప్రయత్నించారు. ఆఖరి ఘడియల్లో స్నేహబంధాన్ని వీడలేదు.

ప్రతిపాడు కు చెందిన లంబు వంశీ (21), సిద్ధం శెట్టి వెంకటేష్  (21), జిల్లా సాయి ప్రకాష్ (23), వీర శంకర్ రెడ్డి  (22), పాతపాటి యశ్వంత్, ఉదయగిరి హేమంత్ స్నేహితులు.  ఆదివారం కావడంతో వీరంతా కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై ప్రత్తిపాడు మండలం తుమ్మల పాలెం డైట్ కళాశాల సమీపంలోని  కొండ క్వారీ వైపు వెళ్లారు. వర్షం పడటం వల్ల కొందరి కాళ్లకు బురద అయింది.

Latest Videos

దీంతో కాళ్లు కడుక్కునేందుకు కొండల మధ్యన ఉన్న లోతైన క్వారీ గుంతలోకి ముందుగా శంకర్ రెడ్డి, సాయి దిగారు. రెండు మూడు అడుగులు ముందుకు వేసిన తర్వాత వారు పైకి రాలేక ఇబ్బంది పడుతుందని గమనించిన వంశీ, వెంకటేష్  దిగారు. స్నేహితులను కాపాడే క్రమంలో వారితో పాటు వీరు మునిగిపోయారు.

నలుగురు యువకులు గల్లంతు కావడంతో ఆ ప్రాంతమంతా బంధువుల రోదనలతో మిన్నంటి పోయింది. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల వారు ఘటనాస్థలానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. ఓ బిడ్డా.. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ గల్లంతైన వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందం అర్ధరాత్రి 12 గంటల వరకు క్వారీ లో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. గుంటూరు సౌత్‌జోన్‌ డి ఎస్ పి జెస్సీ ప్రశాంతి, ఆర్డీవో భాస్కర్ రెడ్డి, ప్రత్తిపాడు ఎస్.ఐ అశోక్, తహసిల్దార్ ఏం. పూర్ణచంద్రరావుతో పాటు అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉండి గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

ఓ దశలో సాయిప్రకాష్ చేతులు పైకి లేపి కాపాడండి అంటూ పెద్దగా అరవడంతో ఒడ్డున ఉన్న పాతపాటి యశ్వంత్‌ తనకు పెద్దగా ఈత రాకపోయినా స్నేహితుని కాపాడేందుకు నీళ్లలోకి అందించాడు అతన్ని బయటకు లాగేందుకు శతవిధాలా యత్నించాడు చివరకు ఫలితం లేకపోవడంతో సాయి చేయి విడువక తప్పలేదని యశ్వంత్ కన్నీరుమున్నీరయ్యారు 

యడ్లపాడు క్వారీ ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.క్వారీ గుంతలో పడి నలుగురు యువకులు గల్లంతవ్వడం విష్మయానికి గురిచేసిందని హోంమంత్రి అన్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించిన హోంమంత్రి. చనిపోయిన యువకుల కుటుంబసభ్యులకు ప్రఘాడ సానిభూతిని తెలిపారు. 
 

click me!