గుంతకల్లు రైల్వే జోన్ సాధన దిశగా

Published : Jul 23, 2017, 05:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
గుంతకల్లు రైల్వే జోన్ సాధన దిశగా

సారాంశం

వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమను ఆదుకోవాలి రైల్వే జోన్ సాధన సమితి డిమాండ్  

 
 గుంతకల్లును  రైల్వే జోన్ చేయాలని రాయలసీమ  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆనంతపూర్  పట్టణంలోని  చైతన్య జూనియర్ కాలేజ్ లో దీనిపై సమావేశం  జరిగింది. ఈ సందర్భంగా గుంతకల్ రైల్వేజోన్ సాధన సమితి కన్వీనర్ రాజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ... వెనకబడిన జిల్లాల్లో రైల్వేజోన్ ఏర్పాటుచేయడానికి కేంద్రం చొరవ చూపాలని డిమాండ్ చేసారు.
 దీని వల్ల వేల సంఖ్య లో  ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉద్యోగాలు  వస్తాయన్నారు. విశాఖపట్నం ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిందని, దాని కంటే తమకే రైల్వే జోన్ ఎక్కువ అవసరమన్నారు. అదీకాక చత్తీస్ఘఢ్,ఒరిస్సా రాష్ట్రాలు విశాఖ ను రైల్వేజోన్ గా అంగీకరించడం లేదని గుర్తు చేసారు.  
 విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్ రాష్ట్రానికి ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.  కావున కరువు ప్రాంతమైన సీమలో  రైల్వేజోన్ పెట్టడం వల్ల ఈ ప్రాంతానికి మేలుజరిగే అవకాశం ఉందన్నారు.
రాయలసీమ విద్యార్థి దళం అధ్యక్షుడు భార్గవ్ మాట్లాడుతూ... కర్ణాటక ప్రభుత్వం బెంగళూర్ కి జోన్ వద్దని, వెనకబడిన హుబ్లీ ని జోన్ చేసారు. అదే విదంగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా  గుంతకల్ ను రైల్వేజోన్ చేయకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు.
 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్