
దేశంలో అవినీతికి ఆస్కారమున్న అన్ని వ్యవస్థల్లో మార్పులు తేవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని అమిత్ షా అన్నారు.అందులో భాగంగానే పన్నుల సంస్కరణకు జీఎస్టీ ని ప్రవేశపెట్టి, దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ప్రవేశపెట్టామని తెలిపారు. అలాగే ఇపుడు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని అన్నారు.
అందులో భాగంగా రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంట్ కు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహణకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.అందుకోసం రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని,అన్ని కుదిరితే ఈ నిర్ణయాన్ని రానున్న ఎన్నికల్లోనే అమలుపర్చనున్నట్లు తెలిపారు.
వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడం ఫ్రభుత్వానికి భారమే కాకుండా, అభివృద్దికి ఆటంకంగా మారిందన్నారు. అంతే కాకుండా ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించడం వల్ల ధన ప్రవాహాన్ని తగ్గించే అవకాశం ఉందని అమిత్ షా తెలిపారు.
దీని ద్వారా మోదీకి ఉన్న ప్రజాదరణను, రాష్ట్రాల్లో ఓట్లుగా మలచాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. స్థానిక పార్టీలను దెబ్బతీయడానికి బీజేపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు,ఆ పార్టీల మద్దతు ఎంతవరకు ఉంటుందో చూడాలి.
గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ సంస్కరణ అమలుకి పార్టీ తరపున మద్దతు తెలిపామని,అన్ని పార్టీలు మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు.