కడప జిల్లా జెడ్పీ సమావేశంలో ఉద్రిక్తత

First Published Jul 23, 2017, 4:32 PM IST
Highlights
  • ఎమ్మెల్యే రాచమల్లు, మంత్రి ఆదినారాయణ రెడ్డి వాగ్వాదం 
  • కేంద్ర కరువు నిధులపై మొదలైన గొడవ 

  
 

కడప జిల్లా జెడ్పీ సమావేశం తోపులాటలు,వాగ్వివాదాల మద్య జరిగింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆర్డీవో వినాయక్‌పై  ఫిర్యాదుకు ప్రయత్నించగా, ఇది పిర్యాదులకు సమయం కాదని తర్వాత చేయలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆవేశంగా అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే, మంత్రి  మధ్య  తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. 
అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఒక దశలో బాహాబాహీకి దిగారు. కేంద్రం అందిస్తున్న నిధులపై చర్చలో భాగంగా  ఇరు వర్గాల మద్య మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. 
కేంద్రం విడుదల చేస్తున్న కరువు నిధులను అదికార పార్టీ సభ్యులకే అందిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.దీనిపై కలెక్టర్ వివరణ ఇస్తుండగా వారు అడ్డు తగిలారు.దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ సభ్యులు కూడా వైసీపి కి వ్యతిరేకంగా నినదించడంతో గొడవ పెద్దదయ్యింది.
వైసీపి ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి లు జెడ్పీ సభ్యులకు మద్దతుగా నిలిచారు. సభలోనే ఉన్న మంత్రి  దీనిపై సమాదానం చెప్పాలని వారు పట్టుబట్టారు.దీనిపై మంత్రి ఆదినారాయణరెడ్డి   తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.  
 

click me!