రైల్వే పట్టాలపై చిక్కుకున్న కారును వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ప్రమాదాన్ని గుర్తించిన కారులోనివాారు రెప్పపాటులో ప్రాణాలు బయటపడ్డారు.
విశాఖపట్నం : రైలు పట్టాలు దాటే క్రమంలో ఓ కారును గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వేగంగా దూసుకొస్తున్న రైలును గమనించి కారులోని వారు బయలకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. రెప్పపాటులో ట్రాక్ పై నిలిచిన కారును గూడ్స్ రైలు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యింది.
వివరాల్లోకి వెళితే... రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబం మారుతి బలేనో కారులో శ్రీహరిపురం నుండి విశాఖ నగరం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి షార్ట్ కట్ మార్గంలో విశాఖకు చేరుకోవాలనుకుని పోర్ట్ రోడ్డులో కారును పోనిచ్చారు. ఈ క్రమంలోనే మారుతి సర్కిల్ వద్దగల రైల్వే ట్రాక్ ను దాటుతుండగా ఒక్కాసారిగా గూడ్స్ రైలు దూసుకొచ్చింది. ముందుగానే కారు ట్రాక్ పై ఇరుక్కున్నట్లు గుర్తించిన లోకో ఫైలట్ ట్రైన్ వేగాన్ని నియంత్రించడంతో కారులోని నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
వీడియో
కారును ఢీకొట్టిన రైలు కొంతదూరం లాక్కెళ్లింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. అయితే కారులోని నలుగురు కుటుంబసభ్యులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రైవేట్ వేర్ హౌజ్ కు వెళ్లే రైల్వే ట్రాక్ పై ఈ ప్రమాదం జరిగింది.
Read More విశాఖలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా నీటి సంపులో దూకి తల్లి ఆత్మహత్య..
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తమ వివరాలు వెల్లడించడం ఇష్టంలేని రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబం మరో వాహనంలో ప్రమాదస్థలి నుండి వెళ్లిపోయింది. వారి వివరాలను పోలీసులు సైతం వెల్లడించడంలేదు.