పాలనా వికేంద్రీకరణతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్ చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు పాలనను మరింత చేరువైందన్నారు. చంద్రబాబునాయుడు ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు.
అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణతో మంచి పలితాలు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. పరిపాలనా అందరికీ అందాలన్నా వికేంద్రీకరణ అవసరమన్నారు. ఏపీ అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రజల వద్దకే పాలనను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో గ్రామ సచివాయాలను ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఒక్కో గ్రామ సచివాలయం ద్వారా 600 సేవలను అందిస్తున్నామన్నారు. పచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని సీఎం జగన్ గుర్తు చేశారు. 2.70 లక్లల మంది వాలంటీర్లు మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్నారని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంటింటికి రేషన్, పెన్షన్లు అందిస్తున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ అందిస్తున్న విషయాన్ని ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పరిశీలిస్తున్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల గోదావరికి వచ్చిన వరదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబందులు లేకుండా ప్రజలకు సహయం అందించడానికి పాలనా వికేంద్రీకరణే కారణమైందని సీఎం జగన్ చెప్పారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 13 జిల్లాలతో పాటు రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. కుప్పంలో కూడా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు తనకు లేఖ రాసిన విసయాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబునాయుడు కుప్పాన్ని ఎందుకు రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
undefined
40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకొనే చంద్రబాబుకు ఏనాడైనా గ్రామ సచివాలయాల గురించి ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కృష్ణ లంక రిటైనింగ్ వాల్ ను కూడా చంద్రబాబు నిర్మించలేకపోయారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు.
also read:వెయ్యి రోజులుగా అమరావతిలో కృత్రిమ ఉద్యమాలు: ఏపీ అసెంబ్లీలో జగన్
మనమంతా నిశ్చితంగా ఉంటున్నామంటే కారణమైన దుర్గమ్మ గుడి అభివృద్దికి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదన్నారు. అమరావతిలో చంద్రబాబు తాను ఉంటున్న ప్రాంతంలో కరకట్ట రోడ్డు విస్తరణ పనులను కూడ చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరకట్ట విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. విజయవాడ, మంగళగిరి అభివృద్దిని కూడ అడ్డుకున్నారన్నారు. రూ. 250 కోట్లతో అంబేద్కర్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్దికి సంబంధించి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా చూపారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ పనులు ఎందుకు చేయలేకపోయారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.