అక్టోబర్ 1 నుంచి దుల్హన్ పథకం అమలు.. హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం..

Published : Sep 15, 2022, 04:52 PM IST
 అక్టోబర్ 1 నుంచి దుల్హన్ పథకం అమలు.. హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ పథకం అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా అక్టోబరు 1నుంచి దుల్హన్‌ పథకం అమలు చేయనున్నట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ పథకం అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా అక్టోబరు 1నుంచి దుల్హన్‌ పథకం అమలు చేయనున్నట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏపీ ప్రభుత్వం దుల్హన్ పథకం అమలు చేయడం లేదంటూ హైకోర్టులో మైనార్టీ పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పథకం ఎందుకు అమలు చేయడం లేదంటూ గతంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే నేడు ఇందుకు సంబంధించిన విచారణలో భాగంగా.. ప్రభుత్వం తరఫున అడ్వొకెట్ జనరల్ సమాధానమిస్తూ.. వచ్చేనెల 1 నుంచి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జీవో 39ను హైకోర్టుకు సమర్పించారు. 


అర్హులకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకూ దుల్హన్ పథకం కింద ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇక, దుల్హన్ పథకం అమలులో మీరు విజయం సాధించారని పిటిషనర్ తరుపు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్