కేంద్ర వర్సిటీలు భూమి పూజ వరకే... జవదేకర్‌వన్నీ అబద్ధాలే: గంటా

Published : Aug 05, 2018, 04:30 PM IST
కేంద్ర వర్సిటీలు భూమి పూజ వరకే... జవదేకర్‌వన్నీ అబద్ధాలే: గంటా

సారాంశం

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇవాళ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభానికి హాజరైన ఆయన.. ఏపీకి సంబంధించి జవదేకర్ మాట్లాడిన మాటలను ఖండించారు

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇవాళ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభానికి హాజరైన ఆయన.. ఏపీకి సంబంధించి జవదేకర్ మాట్లాడిన మాటలను ఖండించారు.

కేంద్ర యూనివర్సిటీలు కేవలం భూమి పూజకు మాత్రమే నోచుకుంటున్నాయని.. కేంద్రం కేటాయించిన నిధుల్లో కేవలం 10 శాతం మాత్రమే వచ్చాయని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్రం ప్రకటించిన 7 వర్సిటీలకు 3,508 ఎకరాలను రాష్ట్రప్రభుత్వం సేకరించిందని గంటా తెలిపారు. వర్సిటీలకు ఇచ్చిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే