కాపు రిజర్వేషన్లు: జగన్ వ్యాఖ్యల్లో తప్పు లేదు: మోత్కుపల్లి

First Published Aug 5, 2018, 1:57 PM IST
Highlights

కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని  మాజీ మంత్రి, టీడీపీ నుండి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని  మాజీ మంత్రి, టీడీపీ నుండి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు.  కాపులను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొని  చంద్రబాబునాయుడు వదిలేస్తున్నారని  ఆయన  విమర్శించారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల విషయంలో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోకూడదని ఆయన సూచించారు.

తన లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు  ఆరోపించారు. తాను ఏ పార్టీలో చేరబోనని ఆయన చెప్పారు.  ఎస్సీ వర్గీకరణను త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

కాపులను తన స్వార్థానికి ఉపయోగించుకొని  వదిలేశాడని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.ఈ విషయంలో బాబు వైఖరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కాపులకు హితవు పలికారు. 

రెండు రోజుల క్రితం మోత్కుపల్లి నర్సింహులు జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది. జనసేన చీఫ్ ను కలుస్తారని కూడ ప్రచారం సాగింది. అయితే పవన్ కళ్యాణ్ ను ఆయన కలువలేదు. జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడ ఆయనకు దక్కే అవకాశం కూడ లేకపోలేదని ప్రచారం సాగింది. ఈ విషయమై ఆయన ఆదివారం నాడు స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని ప్రకటించారు.

ఈ వార్త చదవండి: పవన్‌తో మధ్యాహ్నం భేటీ: జనసేనలోకి మోత్కుపల్లి

click me!