దారుణం: ఇంజక్షన్ వికటించి రిమ్స్‌లో ముగ్గురి మృతి, 8 పరిస్థితి విషమం

First Published Aug 5, 2018, 1:22 PM IST
Highlights

 శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఎనిమిది మంది  పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన  చికిత్స కోసం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఎనిమిది మంది  పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన  చికిత్స కోసం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై  ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనపై ప్రభుత్వం  విచారణకు ఆదేశించింది.

శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలోని మహిళల వార్డులో స్టెఫ్స్‌క్స్  అనే ఇంజక్షన్  వికటించి ముగ్గురు మృతి చెందారు.  ఈ వార్డులో  సుమారు 32 మంది మహిళలకు ఈ ఇంజక్షన్  ఇచ్చారు.  ఈ ఇంజక్షన్ వికటించి 21 మంది అస్వస్థతకు గురయ్యారు.  వీరిలో ముగ్గురు  మృతి చెందారు. మృతి చెందిన వారిని  దుర్గమ్మ, అనిత, శైలజగా గుర్తించారు. 

ఇంజక్షన్ వికటించిన విషయాన్ని గుర్తించిన వైద్యులు  రోగులకు చికిత్స అందించారు.  అయితే  ముగ్గురు  మృతి చెందారు.  అయితే  పరిస్థితి విషమించిన  ఎనిమిది మందిని  కేజీహెచ్ ఆసుపత్రికి  తరలించారు.

అయితే ఈ ఇంజక్షన్  ఇచ్చిన తర్వాత రోగుల పరిస్థితి  విషమంగా మారడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. రోగులకు అత్యవసర చికిత్స అందించారు. దీంతో కొందరు రోగుల ప్రాణాలు దక్కాయి. అయితే పరిస్థితి విషమించి  దుర్గమ్మ, అనిత, శైలజలు మృత్యువాత పడ్డారు. పరిస్థితి విషమించిన 8 మంది రోగులను విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ విషయంపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్  ఆదివారం నాడు రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఘటనపై  ఆర్డీఓ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ బ్యాచ్‌కు చెందిన  ఇంజక్షన్లను వెంటనే  వెనక్కి రప్పించారు.  ఈ ఇంజక్షన్ ను వాడకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.  బాధితులను అన్ని రకాలుగా ఆదుకొంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఐ నేతలు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.  
 

click me!