
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాటాకు చప్పులకు తాను భయపడనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, ఖర్జూర నాయుడు ఎంతమంది వచ్చినా నన్ను, నానిని వెంట్రుక కూడా పీకలేరని వంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టాభి కోర్టు పనిపై గన్నవరం వస్తాడని అప్పుడు చెబుతానని హెచ్చరించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు భూమి కదిలిపోయిందని వల్లభనేని ఎద్దేవా చేశారు. ఉడుత ఊపులకు తాము భయపడమని.. తాను, నాని తెలుగుదేశం స్కూల్ లో చదువుకున్నవాళ్లమేనని వంశీ స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌లు అయ్యామని ఆయన అన్నారు. గన్నవరం, గుడివాడ నియోజవర్గాల్లో చంద్రబాబు,లోకేష్‌లు పోటీ చేయొచ్చు కదా అని వంశీ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున తాను పోటీ చేస్తానని వల్లభనేని తేల్చిచెప్పేశారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు వైసిపి పెట్టిన తర్వాత చేరిన వారేనని ఆయన గుర్తుచేశారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయిన తర్వాత ఆఫీసు తీసివేయలేదని , యార్లగడ్డ వెంకట్రావు లాగా ఇంట్లో దాక్కోలేదని వంశీ సెటైర్లు వేశారు. యార్లగడ్డ వెంకట్రావుకు ఉక్కు రోషం ఉంటే సీఎంతో మాట్లాడుకోవాలని ఆయన చురకలంటించారు.
ALso REad: ఈ వెధవల్లాగే మేమూ సంపాదించాం...: దుట్టా, యార్లగడ్డకు ఎమ్మెల్యే వంశీ కౌంటర్
తనకు సంబంధం లేని సంకల్ప సిద్ధి పై నేను లీగల్ నోటీసు ఇచ్చానని వల్లభనేని వంశీ తెలిపారు. బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టే నోటీసు ఆపానని ఆయన పేర్కొన్నారు. నోటీసు అందుకున్న పట్టాభి రిప్లై ఇవ్వలేదని.. వైసిపి నాయకులను తాను తిట్టలేదని వంశీ స్పష్టం చేశారు. హోటల్ పార్క్ ఎలైట్ లో వైసీపీ నాయకులతో భేటీ అయ్యానని.. యార్లగడ్డ వైపు ఉండండి లేకపోతే తన వైపు ఉండండి అని అడిగానని వల్లభనేని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా గ్రూప్ పెట్టి కొడాలి నానిని, తనను విమర్శిస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.