
ఏపీ సీఎం జగన్ స్వార్థంతోనే గంగవరం పోర్టు అదానీకి అమ్మేశారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి 10.4 శాతం వాటా 2.1 రెవెన్యూ షేర్ ఉన్న పోర్టును కేవలం రూ. 645 కోట్లకు అమ్మడం ఏంటని అన్నారు. నిరంతరం ఆదాయం వచ్చే పోర్టును కమీషన్ల కోసం అమ్మడం ఏంటని ప్రశ్నించారు. 100 కోట్ల పైన ఉన్న టెండర్లు ఓపెన్ బిడ్ ద్వారా వేయాలని నిబంధనలు చెబుతున్నాయని అన్నారు. కానీ గంగవరం పోర్టు విషయంలో ఆ నిబంధనను తుంగలో తొక్కారని తెలిపారు.
న్యాయం చేయకుంటే ఆత్మహత్యే దిక్కు... మంగళగిరిలో కడప అభ్యర్థులు నిరసన
ఓపెన్ బిడ్ వేస్తే రాష్ట్రానికి మరింత లాభం వచ్చేదని తెలిపారు. అలా చేయకుండా ఎందుకు ఆదానికే కారుచౌకగా వాటాలను అమ్మారని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలు ప్రజలకు కనిపించకుండా ఉండేందుకే జీవోలను చూపించడం లేదని అన్నారు. గన్నవరం పోర్టును అమ్మడం వల్ల విశాఖ ఉక్కు ఉనికికే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటికరించడం సరైంది కాదని చెబుతున్న ఏపీ ప్రభుత్వం.. గంగవరం పోర్టు విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తించిందని అన్నారు. గంగవరం పోర్టును అమ్మేడయం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందని అన్నారు.
వైసీపీ తీరువల్లే సంక్షోభంలోకి చేనేత రంగం - నారా లోకేష్
మంచి అవకాశాన్ని ఏపీ వాడుకోలేదు..
జగన్ హాయంలో ఎన్నో సహజ వనరులు దోపిడికి గురవుతున్నాయని ఆరోపించారు. దేశంలో అతి పెద్ద సముద్ర తీర ప్రాంతం ఏపీకి ఉందని అన్నారు. ఇందులో ఎన్నో పోర్టులను నిర్మించవచ్చని తెలిపారు. ఇవి రాష్ట్రానికి ఎంతో ఆదాయం తీసుకొచ్చేవని తెలిపారు. ఇలాంటి అవకాశం ఏ రాష్ట్రానికి లేవని అన్నారు. దానిని ఉపయోగించుకోవడానికి టీడీపీ హయాంలో కృషి జరిగిందని అన్నారు. అప్పటి సీఎం ఈ విషయంలో అడుగులు వేశారని తెలిపారు.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుపై: తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్
పోర్టులు నిర్మించడానికి మాజీ సీఎం చంద్రబాబు కృషి చేశారని అన్నారు. పోర్టులు నిర్మిస్తే దానికి అనుబంధంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి, దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని అన్నారు. పెట్టుబడులు కూడా పెరుగుతాయని తెలిపారు. వీటిని గుర్తించిన చంద్రబాబు నాయుడు గంగవరం, కాకినాడ ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణానికి పీపీపీ విధానంలో పనులు మొదలు పెట్టారని తెలిపారు. చిన్న పోర్టులను నిర్వహించడం కోసం టీడీపీ హయాంలో మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేశామని అన్నారు. ఆ పోర్టులు తొందరలోనే బాగా అభివృద్ధి చెందాయని అన్నారు. వాటిని కూడా సీఎం జగన్ అమ్మబోతున్నారని ఆరోపించారు. ఇప్పుడు అమ్మేసిన గంగవరం పోర్టును పోర్టును కూడా పీపీపీ విధానంలో నిర్మించారని తెలిపారు. అయినప్పటికీ ఇందులో ఏపీ ప్రభుత్వ వాటా 10.4 శాతం ఉందని అన్నారు. ప్రభుత్వం కింద 1800 ఎకరాల భూమి ఉందని తెలిపారు. దీనిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.