
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ తీరు వల్లే చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ ఆరోపించారు. ఈ మేరకు చేనేత రంగపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరపాలని ఏపీ సీఎం జగన్ కు లోకేష్ లేఖ రాశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని తెలిపారు. పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. వాటిని ఇప్పుడున్న ప్రభుత్వం నీరు గార్చిందని అన్నారు. అందుకే ఇప్పుడు ఆ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్
ఇప్పుడే చితికిపోయి ఉన్న చేనేత రంగంపై జీఎస్టీ కొత్త స్లాబ్ మరింత ఇబ్బంది పెడుతుందని అన్నారు. చేనేత ఉత్పత్తులపై 12 శాతం ట్యాక్స్ విధించడం సరైంది కాదని అన్నారు. చేనేత ఉత్పత్తుల తయారీ కోసం ఉపయోగించే ముడి సరుకుల ధరలు, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. దీంతో చేనేత కార్మికులకు 2 నుంచి 5 శాతం లాభం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జీఎస్టీ స్లాబ్ మార్చడం వల్ల ఎంతో మంది కార్మికులకు నష్టం జరుగుతుందని అన్నారు. చాలా మందికి ఉపాధి కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి చేస్తున్నాయని అన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ చేయడం లేదని ఆరోపించారు.
గోరంట్ల మాధవ్: నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణంరాజుకి అమిత్ షా రిప్లై
ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. అలా చేయడం కుదరకపోతే చేనేత రంగంపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని అన్నారు. చేనేత రంగం ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను అప్కో ద్వారా క్రయవిక్రయాలు జరిపించాలని సూచించారు. ఆ రంగాన్ని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం అమలు చేసిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. చేనేత కార్మికులు ప్రోత్సహకాలు అందించాలని కోరారు. దేశంలోనే ఏపీ చేనేత రంగాన్ని ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. ఆ రంగంపై ఆధారపడి ఉన్న కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని కోరారు. చేనేత కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.