కక్షతోనే నాపై కేసులు: వైసీపీ సర్కార్ పై ఆశోక్ గజపతి రాజు

By narsimha lodeFirst Published Dec 23, 2021, 5:08 PM IST
Highlights

కక్షతోనే తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై  మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు చెప్పారు. గురువారం నాడు విజయనగరం లో ఆయన మీడియాతో మాట్లాడారు.

విజయనగరం: తనపై కక్షగట్టి వైసీపీ సర్కార్ కేసులు బనాయిస్తుందని మాజీ కేంద్ర మంత్రి Ashok Gajapathi Raju చెప్పారు.Ramateertham  బోడికొండపై నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో తనపై కేసు నమోదు చేయడంపై గురువారం నాడు ఆశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. దేవాలయాల నిధులను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం దాన్ని పాటించడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించింనందుకు తనపై కేసులు  బనాయిస్తున్నారని  ఆయన ఆరోపించారు. Ycp సర్కార్ హిందూ ధర్మాన్ని కాలరాస్తోందన్నారు. నిన్న కోదండరామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇష్టారీతిలో చేశారన్నారు. ట్రస్టుల ఆచారాలు, సంప్రదాయాలు పాటించాల్సిందేని ఆశోక్ గజపతి రాజు చప్పారు. రామతీర్థంలో నిన్న జరిగిన ఘటన విచిత్రంగా ఉందన్నారు. శంకుస్థాపన సమయంలో ఆచారాలను పాటించలేదన్నారు. ఇదే తనకు బాధను కల్గించిందని మాజీ కేంద్ర మంత్రి చెప్పారు. హిందూ ధర్మ ప్రకారమే ఆలయాలకు విరాళాలు తీసుకొంటారన్నారు. ఆలయాల నిధులను వైసీపీ సర్కార్ ఇతర పనులకు వాడుకొంటుందన్నారు.

 దేవాదాయ చట్టం రాష్ట్రంలో ఉందని అది లేకపోయి ఉంటే తను చైర్మన్ పదవి నుంచి ఈ ప్రభుత్వం ఎప్పుడో తొలగించేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు.దేవాలయాలకు దేవుడే యజమాని అని  ఆయన చెప్పారు.దేవాదాయ శాఖ మంత్రి వాడుతున్న భాష తనకు రాదన్నారు. తనపై ప్రభుత్వం వ్యక్తిగతంగా దృష్టి సారించిందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. రామతీర్ధం కొండపై ఆలయ పునర్నిర్మాణ ముహూర్తం తేదీ నిర్ణయించే ముందు తెలియపరచమని చెప్పినా తన మాట పట్టించుకో లేదన్నారు. ప్రభుత్వంలో దేవాదాయ అంశం భాగం కాదని సుప్రీంకోర్టు పదే పదే చెబుతున్నా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. ఆనవాయితీలు, సంప్రదాయాలు మంట కలిపారన్నారు. పోలీసులకు చెబితే బూట్లు విప్పారు గానీ, రాజకీయ నాయకులు మాత్రం అమర్యాదగా వ్యవహరించారని అశోక్ గజపతిరాజు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

also read:రామతీర్థంలో నిరసన: మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజుపై నెల్లిమర్లలో కేసు

రామతీర్థం బోడికొండపై శ్రీరాముడి విగ్రహం గత ఏడాది క్రితం ధ్వంసమైంది. అయితే ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ నెల 22 కోదండరామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమం గురించి ఆలయ ధర్మకర్తనైనా తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు తీవ్రంగా మండిపడ్డారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు హాజరు కావడానికి ముందే బోడికొండ వద్దకు అనుచరులతో చేరుకొన్న ఆశోక్ గజపతిరాజు నిరసనకు దిగారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని పక్కకు తోసేశారు. ఈ సమయంలో పోలీసులు, అధికారులు ఆశోక్ గజపతి రాజును అడ్డుకొన్నారు. ఈ సమయంలో అధికారులతో ఆశోక్ గజపతిరాజుకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసకొంది. అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారుతమాషా చేస్తున్నారు, సర్కస్ చేస్తున్నారని ఆశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్య క్తం చేశారు.శంకుస్థాపన స్థలంలోనే బైఠాయించి నిరసనకు దిగారు. అయితే ఈ సమయంలో  అధికారులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

click me!