కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. గురువారం నాడు ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. వరదల కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలను ఆదుకొంటామని సీఎం హామీ ఇచ్చారు.
కడప: కడప జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకొంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వరదల కారణంగా మృతి చెందిన వారిని తీసుకురాలేమన్నారు. అయితే బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొంటుందని సీఎం చెప్పారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం Ys Jagan గురువారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
also read:రేపటి నుండి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన... పులివెందులలో క్రిస్మస్ వేడుకలు
వైఎస్సార్ kadapa జిల్లా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుందన్నారు. Proddaturలో 30 నెలల కాలంలో లబ్దిదారులకు రూ.326 కోట్లు నగదు బదిలీ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం రూ. 200 కోట్లు మంజూరు చేశామన్నారు. 22 వేల 212 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్టుగా సీఎం తెలిపారు. కోర్టు కేసులను పరిష్కరించుకుని ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశామన్నారు.ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని సీఎం తెలిపారు. ఇందుకు రూ.163 కోట్లు కేటాయించామన్నారు. 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన పైపు లైను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53 కోట్లు మంజూరు చేసినట్టుగా సీఎం తెలిపారు. నియోజకవర్గ నాయకుల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అత్యంత పారదర్శకంగా అందిస్తున్నామని సీఎం చెప్పారు.