కబడ్డీ .. కబడ్డీ అంటూ కింద పడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని , వీడియో వైరల్

Siva Kodati |  
Published : Dec 23, 2021, 03:53 PM IST
కబడ్డీ .. కబడ్డీ అంటూ కింద పడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని , వీడియో వైరల్

సారాంశం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ (ap assembly speaker) తమ్మినేని సీతారాం (tammineni sitaram) కబడ్డీ (kabaddi tournament) ఆడుతూ కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా (srikakulam) ఆముదాలవలసలో (amadalavalasa) గురువారం క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన ఆయన.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా బరిలోకి దిగారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ (ap assembly speaker) తమ్మినేని సీతారాం (tammineni sitaram) కబడ్డీ (kabaddi tournament) ఆడుతూ కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా (srikakulam) ఆముదాలవలసలో (amadalavalasa) గురువారం క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన ఆయన.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా బరిలోకి దిగారు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందర్నీ హుషారెత్తించారు. ఈ క్రమంలో కాలు జారి కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే సీతారాంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక.. శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో పొట్టి ప్రో కబడ్డీ క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి.సీఎం కప్ పేరుతో టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్‌ కాలేజీ వేదికగా ఆ నియోజకవర్గం స్దాయి సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంబించారు తమ్మినేని సీతారాం.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్