అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: వైసీపీకి బొండా ఉమా సవాల్ ఇదీ

Published : Jan 03, 2020, 02:38 PM IST
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: వైసీపీకి బొండా ఉమా సవాల్ ఇదీ

సారాంశం

అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన విషయమై తాము  చర్చకు సిద్దమేనని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు చెప్పారు.


అమరావతి: గతంలో అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన తప్పుడుమాటలనే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరింత అందంగా వల్లెవేశాడని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామ హేశ్వరరావు ఎద్దేవాచేశారు. కట్టుకథలకు, అబద్ధాలకు, అసత్యా లను నిజం చేయడానికి ప్రయత్నించాడని ఆయన విమర్శించారు.

గురువారం సాయంత్రం మాజీమంత్రి జవహర్‌తో కలిసి ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఒకటిచెబితే సాక్షిపేపర్‌లో వాళ్ల ఛానల్‌లో గతంలో వండివార్చిన కట్టుకథలు, కాకమ్మ కథలకు మరింతమెరుగులద్ది చెప్పారన్నారు.

అమరావతి ప్రాంతంలో 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు జరిగిన ప్రతి కొనుగోలు, భూక్రయవిక్రయాలను టీడీపీకే అంటగట్టడానికి వైసీపీనేతలు అంబటిరాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తమశక్తి  మేరకు కృషిచేశారన్నారు.

 ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అని పదేపదేమాట్లాడే అంబటి రాంబాబు ఇతరనేతలకు ఆ పదానికి అర్థం తెలుసా అని బొండా ఉామా మహేశ్వరరావు ప్రశ్నించారు. కంపెనీస్‌యాక్ట్‌ చట్టం ప్రకారం సెబీపరిధిలో సదరు కంపెనీలకు చెందిన రహస్య సమాచారాన్ని ఆకంపెనీలోని డైరెక్టర్లు, సీఈవోలు లీక్‌చేస్తే దానికిమాత్రమే ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చట్టం వర్తిస్తుందని బొండా ఉమా మహేశ్వరరావు చెప్పారు. 

ప్రభుత్వాలు, వ్యక్తులకు చెందిన వారికి సంబంధించిన భూముల వివరాలు ఈ చట్టం పరిధిలోకి  రావనే విషయాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో తెలుగుదేశంపార్టీ నేతలు ఎక్కడెక్కడ ఎంతెంతభూములుకొన్నారు, ఎప్పుడు కొన్నారనే వివరాలు పత్రాలతో సహా తమవద్ద ఉన్నాయన్నారు. 

ఈ వివరాలన్నింటిపై చర్చించడానికి వైసీపీనేతలుగానీ, ముఖ్యమంత్రి గానీ సిద్ధమేనా అని బొండా ఉమా మహేశ్వరరావు  ప్రశ్నించా రు. అమరావతి రైతుల సమక్షంలోనైనా  తాడేపల్లి వైసీపీ కార్యాలయంలోనైనా  తాము చర్చకు సిద్దంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు చెప్పారు. 

Also read:ఆ తప్పును సరిదిద్దుతాం: రాజధాని‌పై జగన్ కీలక వ్యాఖ్యలు

ఎన్‌ఆర్‌ఐ, ప్రముఖ వైద్యుడైన వేమూరి రవి 2004-2005లోనే 6ఎకరాలు కొన్నారన్నారు. ఆ తరువాత 2014లో రాష్ట్రవిభజన తర్వాత మరో 7 ఎకరాలు కొంటే ఆయన్ని లోకేశ్‌బినామీ అనడం బురదజల్లడం కాదా అని బొండా ఉమా మహేశ్వరరావు  నిలదీశారు. 

Also read:రాజధాని రచ్చ: 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె

2013లో కాంగ్రెస్‌ హయాంలోనే ఎమ్‌.ఎన్‌.సీ. రామారావు (బాలకృష్ణ వియ్యంకుడు) పరిశ్రమ ఏర్పాటుకు భూమి కావాలని దరఖాస్తు చేసుకొన్నారని బొండా ఉమా మహేశ్వరరావు గుర్తు చేశారు. ఈ ధరఖాస్తు మేరకు 2013 సెప్టెంబర్ 28వ తేదీన జగ్గయ్యపేటలోని జయంతిపురంలో భూకేటాయింపు చేశారని ఆయన గుర్తు చేశారు.

Also read:అమరావతి రైతులకుషాకిచ్చిన పోలీసులు: హత్యాయత్నం కేసులు

టీడీపీ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు పెరగడంతో ఆ ధర ప్రకారం సదరు కంపెనీ నుంచి మిగిలినసొమ్ముని వసూలు  చేసినట్టుగా బొండా ఉమా మహేశ్వరరావు చెప్పారు.ఆ భూమిని ఇప్పటికీ తమకు అప్పగించలేదని మాకు ఆభూమి అవసరంలేదని రామారావు  కుమారుడు భరత్‌ చెప్పాడన్నారు.తమడబ్బులు తమకు తిరిగివ్వాలని కూడా కోరాడన్నారు. దాన్నికూడా ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అని ప్రచారం చేయ డం వైసీపీకే చెల్లిందన్నారు

Also read:నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా: ఆళ్ల సంచలనం.

వై.ఎస్‌ రాజశేఖర్ రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్యల హయాంలో చేసిన భూకేటాయింపుల్ని టీడీపీకి ఎలా అంటగడతారని బొండా నిలదీశారు. పబ్లిక్‌లిమిటెడ్‌ కంపెనీ అయిన హెరిటేజ్‌ సంస్థ, చిల్లింగ్‌ కేంద్రాలఏర్పాటుకోసం కంతేరులో 2013లో  5చోట్ల భూములు కొన్న విషయాన్ని బొండా ఉమా మహేశ్వరరావు గుర్తు చేశారు. 

ఈ కొనుగోళ్లు కూడా ఆసంస్థ బోర్డు డైరెక్టర్ల అనుమతితోనే జరిగిందన్నారు. మాజీమంత్రి నారాయణపై కూడా ఇలానే తప్పుడు ఆరోపణలుచేస్తే, ఆయన కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయాన్ని బొండా ఉమా మహేశ్వరరావు గుర్తు చేశారు. 

టీడీపీ నేతలు  పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, పుట్టా సుధీర్‌లపై కూడా ఆరోపణలు చేశారన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర తనకూతురి పేరుతో ఇల్లు కట్టుకోవడానికి ఈ ప్రాంతవాసిగా ఒకగజం కొంటే దానిపై రాద్ధాంతం చేస్తారా.. అని బొండా మండిపడ్డారు. 

4096 ఎకరాలు కొట్టేశారంటున్న వైసీపీ నేతలు వాటికి సంబంధించిన ఆధారాలను పూర్తివివరాలతో మీడియాకు చూపాలన్నారు. వైసీపీనేతలు ఇచ్చిన జాబితాలో2004 నుంచి చూసినా మొత్తం కలిపినా 50ఎకరాలుకూడా లేదన్నారు. లేనిదాన్ని ఉన్నట్లుగా చూపుతూ 4 వేలఎకరాలని చెప్పడం వక్రబుద్ధులున్న వైసీపీకే  చెల్లిందని బొండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు.

ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ చట్టంపరిధిలోకి రాని అంశాన్ని దానిపేరుతో ఎలా దుష్ప్రచారం చేస్తారన్నారు. క్విడ్‌ప్రోకో ద్వారా లక్షలకోట్లు కొట్టేసిన అనుభవాన్ని  ఇలా ఉపయోగించారని మాజీఎమ్మెల్యే ఎద్దేవాచేశారు.

టీడీపీవాళ్లు కొంటే దోపిడీనా... వైసీపీవాళ్లు చేస్తేనేమో దేశంకోసమా...?

టీడీపీపై విషప్రచారం చేయడానికి లేనిదాన్ని ఉన్నట్లుగా చూపిన అంబటి రాంబాబు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతరనేతలుకొన్న భూముల వివరాలపై ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు.

ఏపీ  మంత్రి కొడాలినాని నరుకుళ్లపాడులో 8ఎకరాలు కొన్నారని, ఆళ్ల రామకృష్ణారెడ్డి నీరుకొండలో తనభార్యపేరుతో 5ఎకరాలు కొన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లోనే పేర్కొన్నాడన్నారు. 

పెదకూరపాడు వైసీపీఎమ్మల్యే నంబూరు శంకరరావు  5ఎకరాలు, గుంటూరుపశ్చిమ వైసీపీఇన్‌ఛార్జ్‌ చంద్రగిరి ఏసురత్నానికి భూములున్నాయని, వినుకొండ వైసీపీఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి 34ఎకరాలున్నాయని ఆయన గుర్తు చేశారు. 

 తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్తపేరుమీద 2ఎకరాలు ఉందని వీళ్లందరూ అంబటి రాంబాబు వైసీపీనేతలకు కనిపించలేదా అని బొండా ఆగ్రహంవ్యక్తంచేశారు.  

4096 ఎకరాలు టీడీపీనేతలు కాజేశారంటున్న వైసీపీనేతలు, వాటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలన్నారు. భూముల  వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణగానీ, జ్యుడీషియరీ కమిటీగానీ వేయాలని బొండా సవాల్‌ విసిరారు.

 వైసీపీఎమ్మెల్యేలకు భూములున్నట్లు వారే తమ ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారని వాటికి సంబంధించిన అన్నిపత్రాలు తమవద్ద ఉన్నాయని ఉమా తేల్చిచెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu