ఆ తప్పును సరిదిద్దుతాం: రాజధాని‌పై జగన్ కీలక వ్యాఖ్యలు

Published : Jan 03, 2020, 01:33 PM ISTUpdated : Jan 03, 2020, 02:43 PM IST
ఆ తప్పును సరిదిద్దుతాం: రాజధాని‌పై జగన్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

ఏపీలో రాజధాని విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఏలూరులో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఏలూరు: అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయం తీసుకొంటానని రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు ఏలూరులో  వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో అన్యాయంగా నిర్ణయాలు తీసుకొన్నారని సీఎం వైఎస్ జగన్ చంద్రబాబునాయుడు సర్కార్ తీసుకొన్న నిర్ణయాలపై చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు.

Also read:రాజధాని రచ్చ: 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె

ఈ అన్యాయాన్ని సరిదిద్దుతానని జగన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కొందరికే న్యాయం చేసిందని  జగన్ ఆరోపించారు. అన్నదమ్ముల్లా ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా నిర్ణయాలు ఉంటాయని సీఎం జగన్ తేల్చి చెప్పారు.

Also read:అమరావతి రైతులకుషాకిచ్చిన పోలీసులు: హత్యాయత్నం కేసులు

అందరి అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన  అధికారాన్ని అందరి అభివృద్ధి కోసం వినియోగిస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Also read:నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా: ఆళ్ల సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలు ఇచ్చింది. అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనను నిరసిస్తూ అమరావతి పరిసరాల్లోని 29 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.  అమరావతి పరిసర ప్రాంతానికి చెందిన 29 గ్రామాల ప్రజలు శుక్రవారం నుండి సకల జనుల సమ్మె నిర్వహిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం