బాబుకు షాక్: టీడీఎల్పీ భేటీకి గంటా, వాసుపల్లి, 12 మంది ఎమ్మెల్సీల డుమ్మా

By narsimha lode  |  First Published Jan 19, 2020, 3:36 PM IST

టీడీఎల్పీ సమావేశానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు , వాసుపల్లి గణేష్ లు డుమ్మా కొట్టారు. 



అమరావతి:టీడీపీ శాసనసభపక్ష సమావేశానికి విశాఖకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసిన వారిలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు  ఉండడం గమనార్హం.

Also read:వంశీ, మద్దాల గిరికి టీడీపీ విప్:వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు

Latest Videos

గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి  ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వీరిలో విశాఖ పట్టణానికి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌లు సమావేశానికి హాజరుకాలేదు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం ఆశోక్‌ కూడ సమావేశానికి రాలేదు.

Also read:రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు: నేడు భేటీ కానున్న టీడీఎల్పీ

రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలు కూడ టీడీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టారు. అయితే బెందాళం ఆశోక్, అనగాని సత్యప్రసాద్‌ లు తమ కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమావేశానికి హాజరుకాలేకపోయినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చారని తెలిసింది.

Also read:ఏపీ హైకోర్టు ఆఫర్: సీఆర్‌డీఏకు ఈ నెల 20వ తేదీ వరకు రైతులకు గడువు

ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌లు  ఏ కారణం చేత సమావేశానికి దూరంగా ఉన్నారో స్పష్టత రాలేదు.  విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విశాఖకు చెందిన  టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు తీర్మానం చేశారు. ఈ తీర్మానం వెనుక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించారు.

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయాలనే నిర్ణయాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని టీడీపీ నాయకత్వానికి పంపారు. ఆ తర్వాత అమరావతి రైతులను ఆదుకోవాలని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు.

కానీ ఇవాళ టీడీఎల్పీ సమావేశానికి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్  గైరాజర్హయ్యారు. ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాన్ని వ్యతిరేకించాలని టీడీపీ భావిస్తోంది. 

ఈ తరుణంలో ఈ సమావేశంలో పాల్గొంటే విశాఖకు ఎగ్జిక్యూటివ్ ప్రతిపాదనను వ్యతిరేకించినట్టేనని సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంటుందనే భావనతో సమావేశానికి దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.అసెంబ్లీ సమావేశాల్లో కూడ  ప్రభుత్వ ప్రతిపాదనలపై గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌లు ఎలా వ్యవహరిస్తారనేది ప్రస్తుతం అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

టీడీఎల్పీ భేటీకి 12 మంది ఎమ్మెల్సీల గైర్హాజర్

ఇక టీడీఎల్పీ సమావేశానికి 12 మంది ఎమ్మెల్సీలు కూడ గైర్హాజరయ్యారు.  మండలిలో టీడీపీకి 32 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆదివారం నాడు జరిగిన టీడీఎల్పీ సమావేశానికి 12 మంది ఎమ్మెల్సీలు కూడ రాలేదు.  

శాసనమండలిలో వైసీపీ కంటే టీడీపీకే సంఖ్యా బలం ఎక్కువ.  అయితే 21న, జరిగే సభకు టీడీపీ ఎమ్మెల్సీలు హాజరు అవుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు.తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను అధికార పార్టీ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని  టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్‌ ప్రకటించడం గమనార్హం.బీద రవిచంద్ర యాదవ్ చేసిన  వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.


 

click me!