ఆఖరికి దేవుడి సొమ్ము కూడా... జేసీపై పెద్దారెడ్డి నిప్పులు

By telugu teamFirst Published Jan 19, 2020, 3:13 PM IST
Highlights

తాజాగా జేసీ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ... జేసీ సోదరులపై నిప్పులు చెరిగారు  తాడిపత్రి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అవినీతికి కేరాఫ్‌ అడ్రాస్‌ జేసీ దివాకర్‌రెడ్డి అని ఆయన ధ్వజమెత్తారు. 

నిత్యం ఏదో ఒక రకంగా వివాదాస్పద మనుషులుగా కొనసాగుతున్నారు జేసీ సోదరులు. పోలీసుల మీద చేసిన కామెంట్స్ మొదలు పోలీస్ స్టేషన్ లో నడిచిన హై డ్రామా వరకు వారి చుట్టూ వివాదాలు చుట్టుకుంటున్నాయి. 

తాజాగా జేసీ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ... జేసీ సోదరులపై నిప్పులు చెరిగారు  తాడిపత్రి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అవినీతికి కేరాఫ్‌ అడ్రాస్‌ జేసీ దివాకర్‌రెడ్డి అని ఆయన ధ్వజమెత్తారు. 

ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జేసీ బ్రదర్స్‌ ఓటమి తర్వాత తాడిప్రతిలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాడిపత్రిలో మట్కా నిర్వహించేది, దాన్ని దగ్గరుండి నడిపించేది జేసీ సోదరులేనని ఆయన ఆరోపించారు. 

తనపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధం అని కేతిరెడ్డి సవాల్‌ విసిరారు. వందల కోట్ల రూపాయలను జేసీ సోదరులు ఎలా వెనకేసారో చెప్పాలని జేసీ దివాకర్‌రెడ్డిని డిమాండ్ చేసారు. 

ఆఖరకు దేవుడి సొమ్మును కూడా మింగేశారని ఆరోపిస్తూ... ఆలయాల నిర్మాణం కోసం వచ్చే విరాళాలను కూడా జేసీ దివాకర్‌ రెడ్డి స్వాహా చేశారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ముఠా కక్షలు రేపేందుకు కుట్రలు పన్నుతున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆక్షేపించారు. 

ఇకపోతే నిన్న దివాకర్ రెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. సంక్రాంతి పర్వదినం రోజున ఆయన జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  నిన్న ఈ మాజీ పార్లమెంటు సభ్యుడు మరోసారి రెచ్చిపోయారు.

మూర్ఖత్వంవల్లే జగన్ కాంగ్రెసుకు దూరమయ్యాడని జేసీ దివాకర్ రెడ్డి తాజాగా అన్నారు. అదే మూర్ఖత్వంతో ముఖ్యమంత్రిగా పతనమవుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నామని ఆయన చెప్పారు. 

Also Read: ఏడాది, ఏడాదిన్నరలో సీఎంగా వైఎస్ భారతి: జెసి సంచలనం

అమరావతిని ప్రశాంత యాత్రా స్థలంగా తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు ఒక వ్యక్తిపై ద్వేషంతో జనగ్ కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడని ఆరోపించారు.

Also read: నీ యబ్బ, నువ్వు చచ్చినంత ఒట్టు: జగన్ పై రేచ్చిపోయిన జేసీ దివాకర్ రెడ్డి

మనిషికి తల ఎలాంటిదో రాష్ట్రానికి రాజధాని అలాంటిదని, సచివాలయం ఎక్కడ ఉంటుందో అదే రాజధాని అని ఆయన అన్నారు. సీఎం అమరావతిలోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

See Video: జేసీ దివాకర్ రెడ్డి : కమ్మల ప్రభావం పడితే రెడ్లు సంకనాకిపోతారు...ఇదే అసలు రహస్యం.

click me!