ఆయనేమైనా దేశ ద్రోహం చేశాడా: కిషోర్ అరెస్ట్ పై గంటా ఫైర్

By narsimha lodeFirst Published Jun 23, 2020, 12:58 PM IST
Highlights

నలంద కిషోర్ దేశ ద్రోహం చేశాడా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.  అర్ధరాత్రి మఫ్టీలో పోలీసులు కిషోర్ ను అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు.

విశాఖపట్టణం: నలంద కిషోర్ దేశ ద్రోహం చేశాడా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.  అర్ధరాత్రి మఫ్టీలో పోలీసులు కిషోర్ ను అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చిన  మేసేజ్ లను షేర్ చేసినట్టుగా కిషోర్ తనకు చెప్పారన్నారు.  రోజుకు వందల  మేసేజ్ లు సోషల్ మీడియాలో షేర్ అవుతుంటాయన్నారు. నలంద కిషోర్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

కిషోర్ దేశ ద్రోహానికి పాల్పడ్డాడా రక్షణ వ్యవహరాలను లీక్ చేశాడా అని ఆయన ప్రశ్నించాడు. ఈ మాత్రం దానికి అరెస్ట్ చేయాలా అని సీఐడీని ప్రశ్నించాడు.
మేసేజ్ లో ఎక్కడా కూడ వ్యక్తుల పేర్లు లేవన్నారు.

నాపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.రాజకీయంగా కేసులను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునన్నారు. పోస్టు ఎవరు క్రియేట్ చేశారో వారిపై చర్య  తీసుకోకుండా పోస్టును షేర్ చేసినవారిని అరెస్ట్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు.

also read:టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు మిత్రుడి అరెస్టు: కారణం ఇదీ....

సోషల్ మీడియాలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డిపై ఉన్న కథనాన్ని నలంద కిషోర్ షేర్ చేశాడు. ఈ విషయమై మూడు రోజుల క్రితం ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కిషోర్  చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని అధికారులు సోమవారం నాడు రాత్రి అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నలంద కిషోర్ అత్యంత సన్నిహితుడు.  సీఐడీ కార్యాలయంలో కిసోర్ ను విచారిస్తున్న సమయంలో  ఇవాళ ఆయన అక్కడికి చేరుకొన్నాడు. కానీ  కిషోర్ ను విచారిస్తున్నందున గంటా శ్రీనివాసరావుకు కిషోర్ ను కలుసుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు.


 

click me!