వారిని కాపాడండి: ప్రధాని మోడీకి కింజరాపు రామ్మోహన్ నాయుడు లేఖ

By Arun Kumar PFirst Published Jun 23, 2020, 12:15 PM IST
Highlights

ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలసపోయిన ఉత్తరాంధ్ర ప్రజలు కరోనా కారణంగా తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకున్నారని... వారు ఇప్పుడు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

శ్రీకాకుళం: ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలసపోయిన ఉత్తరాంధ్ర ప్రజలు కరోనా కారణంగా తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకున్నారని... వారు ఇప్పుడు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. వారికి ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతూ ప్రధానికి రామ్మోహన్ నాయుడు ఓ లేఖ రాశారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రం కావ‌డంతో స్వ‌గ్రామాల‌కు చేరుకున్న వ‌ల‌స కార్మికులకు ఉపాధి చూపించే గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ యోజ‌న ప‌థ‌కాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికీ మంజూరు చేయాల‌ని తాను రాసిన లేఖలో ప్ర‌ధాన‌మంత్రిని కోరారు రామ్మోహన్ నాయుడు.  

read more నో సీఐడి...లోకేష్ నోట బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్

కరోనా కారణంగా సొంత ప్రాంతాల‌కు చేరిన వ‌ల‌స‌కార్మికుల‌కు ఉపాధి చూపే ఉద్దేశంతో 6 రాష్ట్రాల‌లోని 116 జిల్లాల‌కు 50 వేల కోట్లు ప్యాకేజీ అందించ‌డం చాలా మంచి నిర్ణ‌యమ‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున వ‌ల‌స‌కార్మికులు తిరిగి చేరుకున్నార‌ని..ముఖ్యంగా త‌న నియోజ‌క‌వ‌ర్గమైన శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ల‌క్ష‌ల మంది వ‌ల‌స‌కార్మికులు వ‌చ్చేశార‌ని ఈ లేఖ ద్వారా ప్రధానికి తెలియ‌జేశారు. 

ఇలా సొంత జిల్లాలకు చేరుకున్న వలస కూలీలు ప‌నుల్లేక, ఉపాధి లేక అల్లాడిపోతున్నార‌ని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని వ‌ల‌స‌ కార్మికులు ఎక్కువగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ యోజ‌న అమ‌లుచేసి ఉపాధి క‌ల్పించాల‌ని లేఖ‌లో ప్ర‌ధానిమోదీని ఎంపీ రామ్మోహన్ నాయుడు కోరారు. 

click me!