నో సీఐడి...లోకేష్ నోట బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్

Published : Jun 23, 2020, 11:20 AM IST
నో సీఐడి...లోకేష్ నోట బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్

సారాంశం

టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసిపి ప్రభుత్వ చర్యలపై విరుచుకుపడ్డారు. టిడిపి నాయకులపై పెడుతున్న కేసులపై స్పందిస్తూ తన మామ బాలయ్య సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ వాడారు. 

గుంటూరు: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసిపి ప్రభుత్వ చర్యలపై విరుచుకుపడ్డారు. టిడిపి నాయకులపై పెడుతున్న కేసులపై స్పందిస్తూ తన మామ బాలయ్య సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ వాడారు. ఇలా బాలయ్య సినిమాలోని డైలాగ్ వాడి వైసిపి చర్యలను తప్పుబట్టారు లోకేష్.  

''వైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సిఐడి,ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సిఐడి,ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి,విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి.108 లో స్కామ్ బయటపడితే నో సిఐడి,మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి'' అంటూ లోకేష్  సోషల్ మీడియా వేదికన పంచ్  డైలాగ్ లు విసిరారు.

read more  టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు మిత్రుడి అరెస్టు: కారణం ఇదీ....
 
''మహిళల పై అత్యాచారాలు,వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేసారు వైఎస్ జగన్ గారు.భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?'' అని ప్రశ్నించారు.

''ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు?కృష్ణ,కిషోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.జగన్ గారి చెత్త పాలన గురించి వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు మరి వారిని కూడా సిఐడి అరెస్ట్ చేస్తుందా?'' అంటూ వైసిపి ప్రభుత్వంపై లోకేష్ మండిపడ్డారు.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu