'యాత్ర' సినిమా: గ్రూపు రాజకీయాల నుండి ప్రజా నేతగా వైఎస్

By narsimha lodeFirst Published Feb 8, 2019, 4:10 PM IST
Highlights

 వైఎస్ఆర్‌లో పాదయాత్ర మార్పు తీసుకొచ్చినట్టుగా యాత్ర సినిమాలో దర్శకుడు చూపించారు. 

హైదరాబాద్: వైఎస్ఆర్‌లో పాదయాత్ర మార్పు తీసుకొచ్చినట్టుగా యాత్ర సినిమాలో దర్శకుడు చూపించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదిగేందుకు  గ్రూప్ రాజకీయాలు చేయడంతో పాటు  కార్యక్రమాలు చేశానని... ప్రజలకు ఏం అవసరమో తెలుసుకోలేకపోయినట్టు వైఎస్ఆర్ చెప్పినట్టుగా ఈ సినిమాలో చూపించారు.

ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకే  పాదయాత్రను ప్రారంభించనున్నట్టు  వైఎస్ఆర్ ప్రకటించారు.  కడప దాటి గడప గడపకు ఇక నుండి వెళ్తానని వైఎస్ చెబుతారు.పాదయాత్ర సమయంలో  ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ఆర్.... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా సంక్షేమ పథకాలను అమలు చేశారు.

అయితే  పాదయాత్ర సమయంలోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ తన సహజధోరణిని భిన్నంగా కన్పించేవారు.పాదయాత్ర సమయంలో రైతాంగం కష్టాలకు ప్రభుత్వంతో పాటు విపక్షంలో ఉన్న తాము కూడ కారణమని వైఎస్ఆర్ ఒప్పుకొంటున్నట్టుగా యాత్ర సినిమాలో డైలాగ్ ఉంది.

యాత్ర సందర్భంగా ఓ గ్రామానికి వైఎస్ఆర్‌ను రాకుండా అడ్డుకొనేందుకు పొలిమేరలోనే  గ్రామస్థులంతా కాపు కాస్తారు.పోలీసులు కూడ ఆ గ్రామం గుండా యాత్ర చేయొద్దని వైఎస్ఆర్‌కు సూచిస్తారు. కానీ, వైఎస్ఆర్ మాత్రమే ఆ గ్రామ పెద్ద రాఘవయ్యతో మాట్లాడేందుకు వెళ్తాడు.

తాను రాజకీయాలు చేయడం కోసం రాలేదని, ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు వచ్చినట్టు చెబుతారు.  మీకునచ్చితేనే తనను గ్రామంలోకి రానివ్వాలని ఆ గ్రామ పెద్దను కోరుతారు. అయితే దయచేసి తమ గ్రామంలోకి రావొద్దని వైఎస్ఆర్‌ను ఆ గ్రామ పెద్ద రాఘవయ్య కోరుతారు.

ఈ మాటతో వైఎస్ఆర్‌ వెను తిరిగి వెళతారు. ఆ సమయంలో తన మాట చెల్లుబాటు చేసుకొనేందుకు ముందుకు అడుగు వేసిన వైఎస్ఆర్ వెనక్కు వెళ్లడాన్ని తాను చూడలేదన్నారు. కానీ, ప్రస్తుతం వైఎస్ఆర్ మారినట్టు కన్పిస్తోందన్నారు.

ఇదే సమయంలో వైఎస్ఆర్‌ను పిలిచి నీవు మారావు... ఈ సారి నా ఓటు నీకే వేస్తాను.... నీ పార్టీకి కాదంటూ ఆ గ్రామ పెద్ద రాఘవయ్య వైఎస్‌కు చెబుతారు. దీంతో వైఎస్ఆర్ రాఘవయ్య కు  నమస్కరించినట్టుగా సినిమాలో చూపించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను మారిపోయినట్టుగా వైఎస్ఆర్ చెప్పుకొన్నారు. తన కోపం అనే నరాన్ని తెంచేసుకొన్నానని కూడ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

'యాత్ర' సినిమా: వైఎస్ స్కీమ్‌ల ప్రకటన వెనుక

'యాత్ర' సినిమా: కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీగా నడిపిన వైఎస్

యాత్ర సినిమా: ఆపద్బాంధవుడుగా వైఎస్ఆర్

యాత్ర సినిమాలో సెంటిమెంట్: గౌరు చరితారెడ్డి సన్నివేశం

'యాత్ర' సినిమా: అచ్చుపోసిన వైఎస్ ఆత్మ కేవీపీ

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

click me!