ఆందోళనలో ఆర్ధిక పరిస్ధితి

First Published Jun 21, 2017, 7:28 AM IST
Highlights

రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో పెట్టుకోకుండా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దుబారు చేస్తూనే ఉన్నారు. ‘చెప్పేదేమో శ్రీరంగ నీతులు’ అన్న సామెతలగా తయారైంది చంద్రబాబు వ్యవహారం. అందరినీ పొదుపు పాటించమని చెబుతూనే ఇంకోవైపు అప్పులు చేస్తూనే అత్యత విలాసవంతంగా గడుపుతున్నారు.

‘దేశం క్లిష్ట పరిస్ధితిల్లో ఉంది’ అన్నది అప్పుడెప్పుడో వచ్చిన ఓ పాపులర్ సినిమా డైలాగ్. అదే డైలాగ్ ఇపుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితికి సరిగ్గా సరిపోతుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై మంగళవారం సమీక్ష తర్వాత ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ‘రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఆదాయ-వ్యయాల మధ్య అంతరం పెరిగిపోతోందట. ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించిన ఆరు ప్రధాన సూచీల్లో ఐదు ప్రతికూలంగా ఉన్నాయంటూ యనమల ఆందోళన వ్యక్తం చేసారు.

ఆర్ధికసంవత్సరం మొదట్లోనే రాష్ట్రం గడ్డు పరిస్ధితిని ఎదర్కొంటోందట. పోయిన సంవత్సరం మొదటి త్రైమాసికమైన జనవరి-మార్చిలో నిలిపేసిన రూ. 10 వేల కోట్ల బిల్లులు ఇపుడు చెల్లించాల్సి రావటంతోనే సమస్యలు మొదలయ్యాయట. మొత్తం రూ. 49 వేలకోట్లు చెల్లించాల్సి రావటంతో ఆర్ధిక పరిస్ధితి క్లిష్టతరంగా మారిందన్నారు. ఆదాయం మరీ తక్కువగా లేకపోయినా చెల్లింపులు పెరిగిపోవటంతోనే సమస్యలు వస్తున్నాయట.

పెరిగిపోతున్న ఖర్చులను నియంత్రించుకోకపోతే రాష్ట్రప్రతిష్టకే భంగం కలుగుతోందని యనమల చెప్పటం నిజంగా ఆందోళనకరమే. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో పెట్టుకోకుండా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దుబారు చేస్తూనే ఉన్నారు. ‘చెప్పేదేమో శ్రీరంగ నీతులు’ అన్న సామెతలగా తయారైంది చంద్రబాబు వ్యవహారం. అందరినీ పొదుపు పాటించమని చెబుతూనే ఇంకోవైపు అప్పులు చేస్తూనే అత్యత విలాసవంతంగా గడుపుతున్నారు. ఎక్కడికెళ్ళినా ప్రత్యేక విమానాలే. చంద్రన్న తోఫా లాంటి అనేక వృధా పథకాలను అనేక ప్రారంభించారు. వాటి వల్ల ప్రతీ ఏడాది ఏల కోట్లు ఖర్చవుతోంది.

చంద్రబాబు చేస్తున్న ఖర్చులను నియంత్రించలేక, ఆదాయాలను పెంచుకునే అవకాశాలు లేక, పథకాలకు, నెలవారీ ఖర్చులకు డబ్బు సర్దుబాటు చేయలేక ఆర్ధికశాఖ అవస్తలు పడుతోంది. ఇప్పటికి ఎన్ని వేల కోట్లరూపాయలు అప్పులు చేసిందో తెలీదు. అందుకే వివిధ శాఖలకు బడ్జెట్లో చేసిన కేటాయింపులను కూడా తగ్గించుకోమంటున్నట్లు యనమల తెలిపారు.

click me!