Andhra Pradesh: ప్ర‌ధాని మోదీకి స‌మీపంలో రెండు అగ్ని ప్ర‌మాదాలు.. ఆ రోజు అమ‌రావ‌తిలో ఏం జ‌రిగింది?

Published : May 06, 2025, 11:03 AM ISTUpdated : May 06, 2025, 11:11 AM IST
Andhra Pradesh: ప్ర‌ధాని మోదీకి స‌మీపంలో రెండు అగ్ని ప్ర‌మాదాలు.. ఆ రోజు అమ‌రావ‌తిలో ఏం జ‌రిగింది?

సారాంశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజ‌రైన విష‌యం తెలిసిందే. మోదీ స‌భ‌కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. అంగ‌రంగ వైభంగా జ‌రిగిన ఈ స‌భ విజ‌య‌వంతంగా ముగిసింద‌ని తెలిసిందే. అయితే ఇదే స‌మ‌యంలో రాజ‌ధాని ప‌రిధిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.   

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న అమరావతికి వచ్చిన రోజు రెండు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనలు మోదీ పర్యటన సమయంలోనే చోటుచేసుకోవడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. ఘటనలు గన్నవరం (విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ సమీపం), అమరావతి రాజధాని పరిధిలోని వెంకటపాలెం గ్రామంలో జరిగాయి.

మొదటి అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగిందంటే.? 

మొదటి అగ్నిప్రమాదం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని బుద్దవరం వద్ద మోదీ విమానం ల్యాండ్‌ కావడానికి కొద్ది సేపటికే జరిగింది. మరుసటి అగ్నిప్రమాదం అదే రోజున సాయంత్రం మోదీ హెలికాప్టర్ టేకాఫ్‌ అయిన సమయంలో అమరావతిలోని సభా ప్రాంగణానికి దగ్గర్లో చోటుచేసుకుంది. రెండు చోట్ల కూడా భారీ పొగలు ఆవరించాయి.

గన్నవరం వద్ద జరిగిన అగ్నిప్రమాదం అనుకోకుండా జరిగిన ప్రమాదంగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అక్కడ 5 ఎకరాలTumma (గుమ్ అరబిక్) చెట్ల పొదలు ఉన్నాయి. నిర్మాణ కార్మికులు సుమారు 100 మంది అక్కడే ఉన్నారు. పడేసిన సిగరెట్ గానీ, మ్యాచ్‌స్టిక్ గానీ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని గన్నవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు.

ఫైర్ ఆఫీసర్ షేక్ జాన్ అహ్మద్ మాట్లాడుతూ, గాజు ముక్కలపై సూర్యరశ్మి పడటం వల్ల కూడా మంటలు అంటుకునే అవకాశం ఉందన్నారు. ఘటనాస్థలికి ఐదు ఫైర్ టెండర్లు పంపించారు. అయితే ఈ ఘ‌ట‌న‌ల వెన‌కాల ఏదైనా కుట్ర కోణం ఉంద‌న్న దానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదనని పోలీసులు తెలిపారు. 

సాయంత్రం రెండో అగ్ని ప్రమాదం

అదే రోజు సాయంత్రం అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ 133 కేవీ అండర్‌గ్రౌండ్ పవర్ లైన్ల కోసం నిల్వ ఉంచిన విలువైన సిలికాన్ HDPE పైపులు పూర్తిగా కాలిపోయాయి. నాలుగు నిల్వ కేంద్రాల్లో రెండు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మంటల వల్ల దాదాపు రూ.9 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఫొరెన్సిక్ నిపుణులు నమూనాలు సేకరించగా, ల్యాబ్ రిపోర్టులు 10 రోజుల్లో రానున్నాయి. 

ఇదిలా ఉంటే 2018లో అమరావతిలోని సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి పెట్టిన రెండు శంకుస్థాపన స్తూపాలు మోదీ పర్యటన మరుసటి రోజు ధ్వంసమైనట్టు గుర్తించారు. ఈ ఘటనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆ ఘటన దర్యాప్తును ASP రామానమూర్తికి అప్పగించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?