
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి లండన్ పర్యటనలో ఎదురైన ఘటన ఇప్పుడు వార్తల్లో ఉంది. అక్కడ ఓ సూపర్ మార్కెట్‌కి వెళ్లిన సమయంలో ఆయన అనుకోకుండా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆయన కుడి భుజానికి తీవ్ర గాయం అయింది. గాయం తీవ్రంగా ఉండటంతో భుజం ఎముక విరిగినట్టు వైద్యులు తెలిపారు. ఫస్ట్‌ఎయిడ్ ఇచ్చినప్పటికీ మెరుగైన చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ను భారత్‌కు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కి తీసుకురావడంపై ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తిస్థాయి సర్జరీ అవసరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.