Vijayawda-Visakhapatnam: గంటలో విజయవాడ నుంచి వైజాగ్ కి

Published : May 06, 2025, 08:28 AM IST
Vijayawda-Visakhapatnam: గంటలో విజయవాడ నుంచి వైజాగ్ కి

సారాంశం

విజయవాడ నుంచి విశాఖ పట్నం వెళ్లే ప్రయాణికులకు ఓ అదిరిపోయే వార్త.జూన్ 1 నుంచి విశాఖ-విజయవాడ మధ్య ఇండిగో ఉదయపు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-విశాఖపట్నం మధ్య విమాన ప్రయాణాలు మళ్లీ మొదలయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రయాణికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ మార్గంపై విమాన సర్వీసులు జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

ఈ ఉదయపు విమాన సేవలు రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు మరింత సులభం చేయనున్నాయి. ఒకవైపు రాష్ట్ర రాజధాని విజయవాడ, మరోవైపు ఆర్థిక కేంద్రం విశాఖపట్నాన్ని ఈ రూట్ కలుపబోతోంది. ఇది రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుందన్నారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వహించనున్న ఈ సేవల షెడ్యూల్ కూడా నిర్ణయించారు. ఉదయం 7.15కి విజయవాడ నుంచి విమానం బయల్దేరి, 8.25కి విశాఖపట్నానికి చేరుతుంది. అదే విమానం 8.45కి విశాఖపట్నం నుంచి తిరిగి ప్రయాణం ప్రారంభించి, 9.50కి విజయవాడ చేరుకుంటుంది.

ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సేవలు మళ్లీ ప్రారంభమవుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యంతో పాటు, రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఇది భాగమవుతుందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి అరెస్ట్‌.. శ్రీకాకుళంలో ఉద్రిక్త పరిస్థితులు
సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu