సుబ్బారావు గుప్తాపై దాడి : సీఎంను కలిసిన తరువాత సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యే అన్నా రాంబాబు

Published : Dec 25, 2021, 08:15 AM IST
సుబ్బారావు గుప్తాపై దాడి : సీఎంను కలిసిన తరువాత సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యే అన్నా రాంబాబు

సారాంశం

సుబ్బారావు గుప్తా కూడా తన స్థాయికి మించి మాట్లాడడం, విమర్శించడం సరైన పద్ధతి కాదు. పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన అంతర్గత వ్యవహారాలు కులమతాలను ఆపాదించొద్దు. ఇలాంటి ఘటనలు మంత్రి బాలినేనికి ఇబ్బంది కలిగిస్తాయి. పార్టీలో ఉన్న వారిని గౌరవించాలి. రాజకీయ పరిస్థితులపై సీఎంను కలిసి వివరిస్తా.. సీఎంను కలిసిన తర్వాత సంచలన నిర్ణయం  తీసుకుంటా’  అని అన్నా రాంబాబు తెలిపారు.

గిద్దలూరు :  ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్తలు సోమిశెట్టి Subbarao Gupta పై జరిగిన దాడిని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే Anna Venkata Rambabu ఖండించారు.  శుక్రవారం Giddaluruలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సుబ్బారావు  గుప్తా పై Subhani దాడి చేయడమే కాక పరుష పదజాలంతో దూషించటం సరైన పద్ధతి  కాదన్నారు.

కేవలం వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే  సుభాని  దాడి చేశారని పేర్కొన్నారు. అదే ఇతర సామాజిక వర్గాలకు చెందిన  వారిపై సుభాని దాడి చేయగలరా?  అని ప్రశ్నించారు. ’ స్వామి భక్తి తో చేశారా? లేక ఏదైనా మనసులో పెట్టుకుని.. నాయకుడు కావాలని.. స్వార్ధంతో దాడి చేశారా? న్యాయస్థానం ఉంది. చట్టాలు ఉన్నాయి.. తగిన మూల్యం చెల్లించక తప్పదు.

సుబ్బారావు గుప్తా కూడా తన స్థాయికి మించి మాట్లాడడం, విమర్శించడం సరైన పద్ధతి కాదు. పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన అంతర్గత వ్యవహారాలు కులమతాలను ఆపాదించొద్దు. ఇలాంటి ఘటనలు మంత్రి బాలినేనికి ఇబ్బంది కలిగిస్తాయి. పార్టీలో ఉన్న వారిని గౌరవించాలి. రాజకీయ పరిస్థితులపై సీఎంను కలిసి వివరిస్తా.. సీఎంను కలిసిన తర్వాత సంచలన నిర్ణయం  తీసుకుంటా’  అని అన్నా రాంబాబు తెలిపారు.

కాగా, డిసెంబర్ 21న సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేయడం సంచలనంగా మారింది. ‘మోకాళ్ళ మీద కూర్చో... దండం పెట్టు.. వాసన్నకు క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను...’ అంటూ ప్రకాశం జిల్లా ongoleకు చెందిన YCP activist సోమిశెట్టి Subbarao Guptaపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది.  ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియోలు  సోమవారం వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు మాట్లాడుతూ... మంత్రి Kodali Nani, MLAs Ambati Rambabu, Vallabhaneni Vamsi, Dwarampudi Chandrasekhar లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి.  ఒంగోలు  లంబాడిడొంకలోని ఆయన నివాసంపై శనివారం  రాత్రి  కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు  గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

వైసీపీ కార్యకర్త సుబ్బారావుపై దాడి : పోలీసుల అదుపులో మంత్రి బాలినేని అనుచరుడు సుభాని

గుంటూరులోని బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆదివారం సాయంత్రం 3.40గంటల సమయంలో ఒక పోలీసు వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జీ వద్దకు చేరుకున్నారు. సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారు. తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని..తనను వదిలి పెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు.

‘అన్నా మీ కాళ్లు పట్టుకుంటా నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. అన్నా.. అన్నా.. నీకు దండం పెడతా.. చెప్పేది విను.. ప్లీజ్.. ప్లీజ్..’ అని కాళ్లావేళ్లా పడినా  సుభాని వినిపించుకోలేదు.  తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ  గుప్తాను కొట్టారు. ‘చంపేస్తా ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్.. రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం’ అంటూ తీవ్ర స్వరంతో బెదిరించారు.

సుభానీతో పాటు మరో వ్యక్తి గుప్తాను చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందికి లాక్కొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి దండం పెట్టిస్తూ మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పించారు.  మొత్తం ఈ ఉదంతాన్ని చిత్రీకరించారు ఈ వీడియో సోమవారం బయటకు రావడంతో తీవ్ర కలకలం రేపింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?