కూతురు ఫోన్ లో యువకుడితో మాట్లాడుతుందని అనుమానం.. డాబాపైనుంచి కిందికి తోసిన తండ్రి.. పరిస్థితి విషమం..

Published : Feb 11, 2023, 06:52 AM IST
కూతురు ఫోన్ లో యువకుడితో మాట్లాడుతుందని అనుమానం.. డాబాపైనుంచి కిందికి తోసిన తండ్రి.. పరిస్థితి విషమం..

సారాంశం

కూతురు ఫోన్లో మాట్లాడుతుందని అనుమానించిన తండ్రి ఆమెను బిల్డింగ్ మీదినుంచి కిందికి తోసేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

పల్నాడు జిల్లా : కన్న కూతుర్నే అతికిరాతకంగా చంపుకుంటున్న తల్లిదండ్రుల ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కూతుర్ల ప్రవర్తన మీద అనుమానపడి ఈ దారుణాలకు ఒడిగట్టడం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. కూతురి బ్యాగులో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు, కండోమ్ లు,  నిరోధక మాత్రలు కనిపించడంతో అత్యంత దారుణంగా గొంతు కోసి చంపి, యాసిడ్ పోసి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన ఘటన  దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ  ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది.

కూతురు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందని కన్నతండ్రి కూతుర్ని డాబాపై నుంచి కిందికి తోసేశాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని ఉన్నవలో జరిగింది. కుమార్తె సెల్ ఫోన్ మాట్లాడుతుండడంతో అనుమానించిన తండ్రి డాబా మీద నుంచి ఆమెను కిందికి నెట్టేశాడు. దీంతో కూతురు తీవ్ర గాయాల పాలయింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై రాంబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉన్నవ గ్రామానికి చెందిన పదహారేళ్ల విద్యార్థి ఇంట్లో ఫోన్ మాట్లాడుతోంది. దీంతో నిత్యం ఫోన్లో మాట్లాడడమేంటంటూ తండ్రి మంందలించాడు. 

కూతురి వద్ద ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్లు, గర్భ నిరోధక మాత్రలు.. గొంతు కోసి దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు..

అయితే ఆమె ఇంట్లో నుంచి డాబా మీదకి వెళ్లి అక్కడ ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టింది. డాబా మీదకి వచ్చిన తండ్రి అది చూశాడు. కూతురు ఎవరో యువకుడితోనే మాట్లాడుతుందని అనుమానించాడు. అంతే.. పట్టరాని కోపంతో కూతురి గొంతు పట్టుకుని కిందికి తోసేశాడు. అనుకోని ఈ పరిణామానికి ఆ విద్యార్థిని తీవ్ర గాయాల పాలయింది. ఆమె కింద పడడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన.రెండు రోజుల క్రితం జరిగింది.

ఈ దారుణానికి సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన మీద ఆ పదహారేళ్ల విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  భర్తనే కూతుర్ని బిల్డింగ్ మీద నుంచి తోసేశాడు అని  ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు  నిందితుడైన సదరు తండ్రిని అరెస్టు చేశారు.  న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. 

ఇక, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. అలహాబాద్ కు చెందిన నరేష్ అనే వ్యక్తి తన కూతురు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. ఊరి చివర్లో ఉన్న కాలువలో ఓ మృతదేహం దొరికింది. అది కుళ్లిపోయిన స్థితిలో ఉంది. అయితే వీరి దర్యాప్తులో భాగంగా తల్లిదండ్రుల మీద అనుమానం వచ్చింది. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించగా.. అమ్మాయి మిస్సింగ్ కాదని.. పరువు హత్య అని తేలింది. కూతురు ఎవరితోనో సంబంధం పెట్టుకుందని.. అది బయటికి వస్తే తన కుటుంబం పోతుందని తామే కూతుర్ని హత్య చేశామని ఒప్పుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!