రెండో భార్య వద్దకు వెళ్లాలని.. కన్నకొడుకునే కట్టేశాడు

Published : Apr 20, 2017, 12:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
రెండో భార్య వద్దకు వెళ్లాలని.. కన్నకొడుకునే కట్టేశాడు

సారాంశం

కర్నూల్ జిల్లా నంద్యాలలో ఘటన

కన్నకొడుకనే కనికరం కూడా లేకుండా ఓ వ్యక్తి తన మొదటి భార్య కుమారిడిని ఇంట్లోనే బంధించి నరకం చూపాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగింది.

 

సల్మాన్ భార్య ఇటీవలే చనిపోయింది. వారికి ఇద్దరు సంతానం. రిహాన్ వారి చిన్న కుమారుడు. అయితే భార్య చనిపోవడంతో సల్మాన్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వేరే ఇంట్లో పెట్టాడు.

 

ఈ నేపథ్యంలో ఐదు రోజుల కిందట తన మొదటి భార్య కుమారుడైన రిహాన్ ను ఇంట్లోనే బంధించి రెండో భార్య ఇంటికి వెళ్లాడు.తాళం వేసిన ఇంటిలో ఆ చిన్నారి ఒక్కడే బిక్కు బిక్కు మంటూ ఐదు రోజులు గడిపాడు. అయితే కరెంట్ బిల్లు కోసం విద్యుత్ సిబ్బంది ఆ ఇంటికి రావడంతో ఈ విషయం వెలుగు చూసింది.

 

దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులుకు ఫోన్ చేశారు. పొలిసులు ఇంటి తాళాన్ని పగల గొట్టి  రెహాన్ ను బయటి తీసుకోవచ్చారు. కర్కశంగా వ్యవహరించిన అతని తండ్రి కోసం  గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

చేతుల మీద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చిన మహిళ | CBN Full Speech At House Pattas Distribution
మహిళ స్పీచ్ కి దండంపెట్టేసిన బాబు | Chandrababu Giving House Pattas To Beneficiaries