
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక నుంచి తన జన్మదినాన్ని అనంతపురం జిల్లా ప్రజల మధ్య జరుపుకుంటారు. ఈ విషయాన్ని ఆయన ఈ రోజు జిల్లా పర్యటనలో ప్రకటించారు.
ఆయన తరచూ పర్యటించే జిల్లాలలో అనంతపురం ఒకటి. ఈ రోజూ 67 వసంతాలు పూర్తిచేసుకుని 68వ ఏట అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా పర్యటకు వచ్చిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయనకిష్టమయిన రెయిన్ గన్ ప్రయోగం ఇక్కడి నుంచే చేశారు. ఇపుడు పంటగుంతలు కార్యక్రమంలో కూడా అనంతపురానికి పెద్ద పీట వేశారు.
ఈ రోజు పామిడిలో ముఖ్యమంత్రికి మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, తిప్పేస్వామి, ఎమ్మెల్యే లు పార్థసారథి, జితేంద్ర గౌడ్, ప్రభాకర్ చౌదరి, ఈరన్న , హనుమంతురాయ చౌదరి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకనుంచి తన ప్రతిజన్మదినానికి జిల్లాకకు వస్తానని, జిల్లా ప్రజల మధ్య ఈ వేడుక జరుపుకుంటానని అన్నారు.
అనంతపురం జిల్లాకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. ఇంత గుర్తింపు ఎందుకిస్తున్నారనేదాని మీద జిల్లా టిడిపి వర్గాల్లో ఆసక్తి కరమయిన చర్చ నడుస్తూ ఉంది.
అయితే, ఆయన కుమారుడు లోకేశ్ ఎన్నికల ప్రవేశానికి అనంతపురం అనువైనదిగా భావిస్తున్నారని, దీనికి రంగం తయారుచేసేందుకే తరచూ జిల్లాలో పర్యటిస్తున్నారని టిడిపిలో ఒక వర్గం భావిస్తున్నది. ఇపుడు ఎమ్మెల్సీగా గెల్చినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల్లో గెల్చినా, నియోజకవర్గాన్ని పిఎ కు వదిలేసి బాలకృష్ణ బాగా అపఖ్యాతి పాలయినందున, ఆయనను వచ్చేసారి తప్పించవచ్చని వినిపడుతూ ఉంది. అయితే, గతంలో ఎన్టీరామారావు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గాన్ని వదలుకోరాదని, బాలకృష్ణ తర్వాత లోకేశ్ దానికి ప్రాతినిధ్యం వహించేలా చూడాలన్నది ముఖ్యమంత్రి వ్యూహమయివుండవచ్చిన టిడిపి నాయకులు అనుమానం.