
వచ్చే ఎన్నికల్లో 200 సీట్లలో టిడిపిని గెలిపించాలని పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఐటి, పంచాయితీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అదేంటి, రాష్ట్రంలో ఉన్నవి 175 నియోజకవర్గాలే కదా? అని ఆశ్చర్యపోవద్దు. చిన్న పిల్లల్ని అడిగినా 175 అనే చెబుతారు. కానీ మనం ప్రశ్నించకూడదు, వినాలంతే. ఎందుకంటే, చెప్పింది లోకేష్ కాబట్టి. ఇదండి తాజాగా మన యువరాజా వారి ఉవాచ. అనంతపురంలో లోకేష్ మాట్లాడుతూ 200 నియోజకవర్గాల్లో టిడిపి గెలవాటని అనగానే నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో ఉన్నవే 175 నియోజకవర్గాలైనపుడు 200 సీట్లలో ఎలా గెలుస్తారంటూ ముందు తమ్ముళ్లే నివ్వెరపోయారు, తర్వాత నవ్వుకున్నారు.
ఈమధ్య లోకేష్ అన్నీ ఇదే విధంగా మాట్లాడుతున్నారు. తాను అందరికన్నా గొప్పోడనుకుంటున్నాడో లేకపోతే అందరికన్నా భిన్నంగా ఉండాలని ట్రై చేస్తున్నాడో మాత్రం తెలియటం లేదు. పల్లెల్లో మంచినీటి సమస్య సృష్టించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, అంబేద్కర్ వర్దంతికి అందరికీ శుభాకాంక్షలని చెప్పి అందరినీ ఆశ్చర్యపరచిన లోకేష్ తాజాగా 200 నియోజకవర్గాల్లో గెలవాలని పిలుపివ్వటం గమనార్హం.