Chittoor Road Accident : పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది. గుడిపాల మండలంలో బుధవారం ఉదయం బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి.
Chittoor Bus Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు బోల్తా (bus overturn)
పడటంతో 22 మందికి గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
జమ్మూకాశ్మీర్ లో దారుణం.. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి..
వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరి నుంచి 33 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు హైదరాబాద్ వెళ్తోంది. ఈ బస్సు చిత్తూరు- వేలూరు నేషనల్ హైవే గుండా ప్రయాణిస్తోంది. బుధవారం ఉదయం గుడిపాల మండలం గొల్లమడుగు వద్దకు చేరుకోగానే మూలమలుపు వద్ద అదుపుతప్పింది. దీంతో ఆ బస్సు అక్కడ ఉన్న ఓ గోడను ఢీకొట్టి, తరువాత బోల్తా పడింది.
150 దేశాల్లోని యూజర్లకు ఆపిల్ థ్రెట్ నోటిఫికేషన్ పంపింది - హ్యాక్ అలెర్ట్ పై అశ్విని వైష్ణవ్ వివరణ
ఈ ప్రమాదంలో అందులో ఉన్న 22 మందికి గాయాలు అయ్యాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ కు చెందిన 65 ఏళ్ల లలిత, అలాగే తమిళనాడు రాష్ట్రం మానియంబాడి ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల కుబేంద్రన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయాలపాలైన ప్రయాణికులను దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు.