కాంగ్రెస్ కి షాక్.. వైసీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి

By ramya neerukondaFirst Published Nov 13, 2018, 12:38 PM IST
Highlights

మంగళవారం   విజయనగరం జిల్లా పార్వతిపురంలో  వైఎస్ జగన్ సమక్షంలో సి. రామచంద్రయ్య వైసీపీలో చేరారు

మాజీ మంత్రి సి. రామచంద్రయ్య  కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆయన ఈరోజు  వైసీపీ  తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలని తీసుకున్న నిర్ణయం నచ్చుక.. ఆయన కాంగ్రెస్ పార్టీని ఇటీవల వీడిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం   విజయనగరం జిల్లా పార్వతిపురంలో  వైఎస్ జగన్ సమక్షంలో సి. రామచంద్రయ్య వైసీపీలో చేరారు

సి. రామచంద్రయ్య తొలుత టీడీపీలో ఉండేవారు.పీఆర్పీ  ఏర్పాటు తర్వాత టీడీపీని వీడి  ఆయన  పీఆర్పీలో చేరారు. పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఇటీవల  కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సి. రామచంద్రయ్య  రాజీనామా చేసి.. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్య వైసీపీలో చేరడం రాజకీయంగా తమకు కలిసి వస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే  రామచంద్రయ్య సోదరుడు ఇంకా టీడీపీలోనే కొనసాగుతుండటం విశేషం. 

 

more news

కాంగ్రెస్‌కు షాక్: వైసీపీలోకి మాజీ మంత్రి సి. రామచంద్రయ్య

చంద్రబాబుతో దోస్తీపై గుర్రు: కాంగ్రెసుకు చిరంజీవి రాంరాం

చంద్రబాబు పాపాలను మోయలేం, అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నా:సి.ఆర్

బాబుతో రాహుల్ దోస్తీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు మరో నేత గుడ్ బై

click me!
Last Updated Nov 13, 2018, 12:38 PM IST
click me!