పాముని మెడలో వేసుకొని సెల్ఫీ.. చివరకు

Published : Nov 13, 2018, 12:18 PM IST
పాముని మెడలో వేసుకొని సెల్ఫీ.. చివరకు

సారాంశం

సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వీధిలో పాములు ఆడించే వ్యక్తి దగ్గర పాము తీసుకొని మెడలో వేసుకొని సెల్ఫీకి ఫోజు ఇచ్చాడు. 


సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వీధిలో పాములు ఆడించే వ్యక్తి దగ్గర పాము తీసుకొని మెడలో వేసుకొని సెల్ఫీకి ఫోజు ఇచ్చాడు. అది కాటు వేయడంతో ప్రాణాలు వదిలాడు. ఈ దారుణం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సూళ్లూరుపేట జీఎన్‌టీ రోడ్డులో దర్గా ఎదురుగా ఓ పాములోడు బుట్టలో నాగు పామును పెట్టుకొని ఆడిస్తున్నాడు. పాముకాటుకు తన వద్ద చెక్కలు ఉన్నాయని, అది కరిస్తే ఈ చక్కలు తింటే విషం విరుగుడు అవుతుందని నమ్మిస్తూ విక్రయిస్తున్నాడు. ఇంతలో మండలంలోని మంగళంపాడుకు చెందిన చిట్టేటి జగదీష్‌ (24) అత్యుత్చాహం చూపి పామును మెడలో వేసుకుంటానని కోరాడు.
 
పాములోడు ఆ పామును అతని మెడలో వేయగా ఫోజులిచ్చాడు. ఇంతలో ఆ పాము అతని చేతిపై కాటు వేసింది. పాము కరచినా ఏమీ కాదంటూ ఆ పాములోడు చెబుతుండగానే అతని నోటి నుంచి నురగరావడం ప్రారంభమైంది. వెంటనే పాములోడు పాముతో సహా పరారయ్యాడు. చుట్టుపక్కలవారు అతనిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పాముకాటు విరుగుడు ఇంజక్షన్‌ తమ వద్ద లేదనడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మృతిచెందాడు.

PREV
click me!

Recommended Stories

గుర్తుపెట్టుకో నిన్ను వదలను అసెంబ్లీ నుంచి జగన్ కు వార్నింగ్ | CM Chandrababu Speech in Assembly
అసెంబ్లీలో జగన్ కి చెమటలు పట్టించిన చంద్రబాబు | CM Chandrababu Naidu speech in Assembly | Jagan