‘‘తుఫాన్‌లను ఆపేశాడు..దోమలను చంపేశాడు’’: బాబుపై విజయసాయి సెటైర్

sivanagaprasad kodati |  
Published : Nov 13, 2018, 12:29 PM ISTUpdated : Nov 13, 2018, 12:31 PM IST
‘‘తుఫాన్‌లను ఆపేశాడు..దోమలను చంపేశాడు’’: బాబుపై విజయసాయి సెటైర్

సారాంశం

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. బాబు ఎల్లవేళలా తాను ఏదో సాధించానంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారని ఎద్దేవా చేశారు.

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. బాబు ఎల్లవేళలా తాను ఏదో సాధించానంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారని ఎద్దేవా చేశారు.

‘రెయిన్‌ గన్‌ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్‌ చేశాడు. తుపాన్‌లను ఒంటిచేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడు బాబు’అని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

అలాగే ప్రలోభాలకు చంద్రబాబు ఆదిగురువు వంటి వారని విమర్శించారు. కులవృత్తులలో మెజారిటీ ప్రజలు బీసీలేనని పేర్కొన్నారు. వారి కోసం వైఎస్ ప్రవేశపెట్టిన ఉచిత విద్య పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అటకెక్కించిందని విజయసాయి మండిపడ్డారు.

గతంలో పచ్చ చొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి.. కుల వృత్తుల వారికి పనిముట్లు పంపిణి పథకంతో పేదరికంపై గెలిచేశామంటూ ముఖ్యమంత్రి ప్రచారం మొదలుపెట్టారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.

కుల వృత్తులలో మెజారిటీ బీసీలే. వారి కోసం వైఎస్ ప్రారంభించిన ఉచిత విద్య పథకాన్ని అటకెక్కించి. గతంలో పచ్చచొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి కుల వృత్తుల వారికి పనిముట్ల పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలెట్టాడు... ప్రలోభాలకు ఆదిగురువైన చంద్రబాబు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్